పీకల దాకా బాగా తాగి తనతో మిస్ బిహేవ్ చేస్తున్న వాళ్ళను చూసి భయపడుతూ ………… !! వదలండి…. డోంట్ టచ్ మీ అంటూ వాళ్ళు తన మీద చేతులు వేస్తూ ఉంటే ……….. !! ఏడుస్తూ దూరంగా జరుగుతూ ఉన్న తనకు సడెన్ గా వరుణ్ కార్ దిగి రావడం తోనే ……… !! వాడ్ని బైక్ తో సహా కింద పడేలా తన్నడం చూసిన నైన ……..!! అప్పటి వరకు భయపడుతూ ఏడుస్తున్న తనకు వరుణ్ ను చూడ్డం తో భయపడుతూ ఏడుస్తూ ………. !!!వెళ్ళి ఆన్నయ్య అంటూ వరుణ్ ను హత్తుకుంటూ వెక్కుతుంది……… !!
నైన ను దూరం జరపాలి అనుకుంటున్న వరుణ్ కి నైన తనను ఆన్నయ్య ………. !!!అని పిలిచిన పిలుపు తన హృదయాన్ని కదిలిస్తుంది ఎందుకంటే వరుణ్ ని మొట్ట మొదటి సారిగా ఆన్నయ్య ……….. !! అని ప్రేమగా పిలిచిన మొట్ట మొదటి వ్యక్తి నైన అందుకే ఆ పిలుపు లోని మాధుర్యానికి బండ రాయిలా ఉన్న వరుణ్ హృదయం కూడా కరిగిపోయింది ………. !!