జ్వాలా ప్రజ్వలనం – 1
🌸🕊️జ్వాలా ప్రజ్వలనం -1🌸🕊️
హైదరాబాద్ మహా నగరం అప్పుడప్పుడే మెల్లిగా నిద్ర లేస్తోంది.. ఆ ఐటీ కారిడార్‌లోని ఎత్తైన బిల్డింగులపై సూర్యకిరణాలు పడుతుంటే, నగరమంతా ట్రాఫిక్ శబ్దాలతో బిజీగా మారుతోంది..
కానీ గచ్చిబౌలిలోని దివాన్స్ కాలనీలో ఉన్న ఆ ఇంట్లో మాత్రం వాతావరణం చాలా వేరుగా ఉంది..
“జే.. అక్క.. ఒసేయ్ జ్వాలా! గంట నుండి పిలుస్తున్నా, ఇంతలా అరుస్తున్న నీకు కనీసం వినపడట్లేదానే ?
అబ్బా నాకు కాలేజీకి టైమ్ అవుతోందె బాబు , నా కాలేజ్ బ్యాగ్ ఎక్కడ పెట్టావ్?” అంటూ గట్టిగా అరుస్తూ రూమ్ లోంచి బయటకు వచ్చింది కావ్య..
జీన్స్ అండ్ టీ షర్ట్ లో హెయిర్ పోనీ వేసుకొని చాందేలి జూంకాస్ పెట్టుకుంటూ కాలేజీ కి లెట్ అవుతుంది అని హడావిడి చేస్తూ..
కావ్య! జ్వాల చెల్లెలు.. B. Tech ఫైనల్ ఇయర్ చదువుతోంది.. ఇంట్లో అందరికంటే ఎక్కువ అల్లరి చేసేది కావ్యనే , జ్వాల ప్రాణం ఆమెలోనే ఉంటుంది.. ఒకరకంగా చెప్పాలి అంటే కావ్య జ్వాలా యొక్క బలహీనత..
చెల్లి అంతలా అరుస్తూ పిలుస్తున్నా జ్వాలమాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, చేతిలో తన రీసెర్చ్ పేపర్ పట్టుకుని, ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియస్‌గా టైప్ చేస్తోంది..
కావ్య అంత గట్టిగా అరిచినా ఆమె దృష్టి మాత్రం ఆ ల్యాప్‌టాప్ స్క్రీన్ పైనే ఉంది.. ఆమె వేళ్లు కీబోర్డ్ మీద మెరుపు వేగంతో కదులుతున్నాయి..
అప్పుడే జ్వాల తల్లి సుమతి కిచెన్ లోంచి కాఫీ కప్పులు పట్టుకుని వస్తూ,
“దానితో నీకెందుకు గొడవ కావ్యా?”
అది ల్యాప్‌టాప్ ముందు కూర్చుంది అంటే ఈ ప్రపంచంతో అసలు సంబంధం లేదు అన్నట్టు అన్ని మర్చిపోతుంది..
అసలు దానికి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలా, లేక ఆ కంప్యూటర్లకే ఇచ్చి చేయాలా అనేది అర్థం కావడం లేదు” అని అంటూ కాఫీ కప్స్ తీసుకొస్తూ వాటిని డైనింగ్ టేబుల్ మీద జ్వాలా పక్కన పెడతారు..
తల్లి మాటలకి చిన్నగా నవ్వుకుంటూ జ్వాల మెల్లగా ల్యాప్‌టాప్ స్క్రీన్ నుండి కళ్లు తిప్పి, ముఖంపై పడుతున్న జుట్టును వెనక్కి నెడుతూ..
“మ్మా!.. ఇది మామూలు కంప్యూటర్ వర్క్ కాదు.. నా లైఫ్ గోల్.. నా తీసిస్ ప్రాజెక్ట్ సెల్యూలర్ రెసిలియన్స్ (కణాల నిరోధకత) ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చింది..
అండ్ ఈరోజు ల్యాబ్‌లో ప్రి ప్రెజెంటేషన్ ఉంది.. ఇది కనుక సక్సెస్ అయితే, క్యాన్సర్ మరియు రేడియేషన్ వల్ల దెబ్బతిన్న నిర్జీవ కణాలను మళ్లీ తిరిగి బతికించే అద్భుతమైన థెరపీ మన మానవాళికి దొరుకుతుంది” అంది చాలా కాన్ఫిడెంట్‌గా..
చంద్రవధనం లాంటి మోము.. కలువ రేకుల్లాంటి నయనాలు మాయ చేస్తాయి ఏమో ఆమె నుండి చూపు కూడా తిప్పుకోలేనంత మనోహరి ఆమె..ఎప్పుడు పెదవులపై చెరగని చిరునవ్వు..
కూతురి మాటలకి గర్వంగా జ్వాల వైపు చూస్తారు ఆమె తండ్రి రాఘవరావు గారు.. ఆయన పేపర్ చదువుతూనే , భార్యని చూస్తూ
“చూడు సుమతీ! నా కూతురు సాధించే ఈ విజయం దేశానికే గర్వకారణం అవుతుంది , నువ్వేమో పెళ్లి పెళ్లి అని అంటూ నా కూతుర్లని సత్తాయించకు” అంటూ జ్వాలా ఇంకా కావ్యలకి సపోర్ట్ చేస్తారు రాఘవగారు..
తండ్రి మాటలకి కావ్య ఇంకా జ్వాలా ఇద్దరు కూడా ఆయన వైపు అభిమానంగా చూస్తారు…
తల్లి వైపు నవ్వుతూ చుసిన జ్వాల లేచి కావ్య దగ్గరికి వెళ్లి, కావ్య తల మీద చిన్నగా మొట్టి.. సోఫా వెనుక వున్నా ఆమె కాలేజ్ బ్యాగ్‌ను తీసి ఇస్తూ,
“ఇదిగోండి మహారాణి! నీ బ్యాగ్.. నిన్న రాత్రి ఇందులోంచి నోట్స్ తీసి చదువుకున్నావ్, అక్కడే పెట్టి మర్చిపోయావ్. మళ్లీ నా మీద అరుస్తున్నావా ?” అంటూ కావ్య ముక్కు గిల్లింది…
కావ్య ముద్దుగా మూతి తిప్పుతూ, “సరేలేండి సైంటిస్ట్ గారు, చెల్లి కోసం ఈ మాత్రం చేయలేరా తమరు అని అంటూ..
హ్మ్మ్.. అక్క ఈరోజు నీ ప్రాజెక్ట్ డెమో ప్రెసెంటేషన్ సక్సెస్ అయితే నువ్వు నాకు బ్రౌనీ ఐస్‌క్రీమ్ ఇప్పించాలి ” అని అడుగుతుంది నవ్వుతూ..
కావ్య నవ్వుని చూస్తూ “ఖచ్చితంగా ట్రీట్ ఇస్తా కవి.. నీకు కాకుంటే ఇంకెవరికి ఇస్తానురా ” అని అంటూ జ్వాల నవ్వుతూ ఒక కాఫీ కప్ తను తీసుకొని ఇంకొక కప్ కావ్యకి ఇస్తూ.. తండ్రి పక్కన సోఫాలో కూర్చుంటూంది..
కాఫీ తాగుతూనే కావ్య ఇంకా రాఘవారావు గారితో తన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తుంది..
తన ప్రాజెక్ట్ గురించి తండ్రి అడుగుతున్న డౌట్స్ కి సమాధానం ఇస్తుంది జ్వాలా.. కావ్య తనకి కాలేజీ కి లెట్ అవుతుంది అని అనడంతో అందరూ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసాక.. కావ్యని కాలేజీ లో డ్రాప్ చేస్తాను అని చెపుతూ.. ఒకవేళ తనకి ఆ రోజు రావడానికి లెట్ అవ్వొచ్చు కంగారు పడకండి అని చెప్తుంది జ్వాలా..
రాఘవారావు గారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లొయ్.. సుమతి గారు ప్రైవేట్ స్కూల్ టీచర్ గా వర్క్ చేసి ఇప్పుడు భర్త ఇద్దరు పిల్లలే లోకంగా బ్రతుకుతున్నారు..
వాళ్ళ పెద్ద కూతురు జ్వాలా బయోటెక్నాలజీస్ట్.. తన లైఫ్ గోల్ అయినా కాన్సర్ నిర్ములనా కోసం రీసెర్చ్ చేస్తుంది..
కావ్య అల్లరి పిల్ల ఇంట్లో అందరికి ఆమె అంటే పంచ ప్రాణాలు.. తన అల్లరితో ప్రేమతో ఆ ఇంట్లో ఎప్పుడు నవ్వులు పూస్తుంది..
అలా అందరూ వారి వారి జీవితాల్లో ఉన్నంతలో హ్యాపిగా వుంటారు.. ఆ ఇంట్లో ఉన్న ప్రేమానురాగాలు, ఆ నవ్వులు చూస్తే ఎవరికైనా అసూయ కలగక మానదు..
కానీ, ఆ సంతోషం వెనుక ఒక పెద్ద తుఫాను రాబోతోందని ఆ కుటుంబానికి తెలిస్తే..
@@@
హైదరాబాద్ లోనే మరోచోట.. అప్పుడే బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ లేస్తాడు ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు తన మీదే కాళ్ళు వేసుకుని పడుకున్న అతడి ఏకైక బంధం అతడి చిన్న నాటి ఫ్రెండ్ అయినా రాహుల్ ని నిర్ధాక్షిణంగా పక్కకి తోసేస్తాడు..
నిద్రలో తన ప్రేయసితో కమ్మని కలలు కంటున్నా రాహుల్ ఎత్తాయినా లోయలో నుండి ఒక్కసారిగా కింద పడినట్టుగా ఫీల్ అవుతూ దొర్లుకుంటూ వెళ్లి బెడ్ మీద నుండి కిందపడి.. నడుము విరగగొట్టుకొని అరుస్తూ నిద్రలేస్తాడు..
రాహుల్ అరుపు కూడా పట్టించుకోకుండా ఫ్రెషప్ అవ్వడానికి వాష్ రూమ్ లోకి దురుతాడు ఆ యువకుడు..
నిద్ర కళ్ళతో.. అందమైన తన కల చెదరడంతో ఉక్రోషంగా తన ఫ్రెండ్ ని కొట్టడానికి చుసిన అతడికి ఆ ఛాన్స్ లేకుండా అతగాడు వాష్ రూమ్ లోకి వెళ్లడంతో..
ఉసురుమంటూ బాల్కనీ లోకి వెళ్లిన రాహుల్ అక్కడ వున్నా మొక్కలకి తన స్నేహితుడి మీద కంప్లైంట్స్ ఇస్తాడు..
తల్లి తండ్రి లేక ఆనాధలుగా కలిసి ఆప్తులుగా మారిన బంధం వారిది.. అమ్మ, నాన్న,అన్న, తమ్ముడు, నేస్తం ఇలా అన్ని ఒకరిలో ఒకరు చూసుకుంటూ వుంటారు..
రాహుల్ కంప్లైంట్స్ అలా సాగుతుండగానే ఫ్రెషప్ అయి వచ్చిన అతడు.. ఒక పక్క వాళ్ళిద్దరి కోసం బ్రేక్ ఫాస్ట్ గా బ్రేడ్ టోస్ట్ ప్రిపేర్ చేస్తూనే మరో వైపు..
ఎదురుగా వున్నా గ్లాస్ స్క్రీన్ మీద సిస్టమ్ హ్యాకింగ్ గ్రాఫ్ చెక్ చేస్తూనే రాహుల్ చెప్తున్నా చాడీలు వింటూ.. ఉంటాడు..
ఒక్కసారిగా తన స్పామ్ మెయిల్ కి వచ్చిన హిడెన్ మెసేజ్ చుసిన అతడు అలెర్ట్ అవుతూ రేయ్ అని రాహుల్ ని పిలవగా..
రాహుల్ “హా బావ” అంటూ కిచెన్ ప్లాట్‌ఫామ్ వైపు రాగానే, ఆ యువకుడు చేతిలో ఉన్న బ్రెడ్ టోస్ట్‌ను ప్లేట్లో వేస్తూ గ్లాస్ స్క్రీన్ వైపు చూపిస్తాడు…
ఆ స్క్రీన్ మీద ఒక అజ్ఞాత ఐడీ నుండి వచ్చిన ఎన్క్రిప్టెడ్ కోడ్ బ్లింక్ అవుతోంది..
“క్లైంట్ నుండి మెసేజ్ వచ్చింది. ఈ రోజే వర్క్ స్టార్ట్ చేయాలి. ఇంతకీ నీ వైపు నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎక్కడి వరకు వచ్చింది?” అని అడిగాడు ఆ యువకుడు, తన కళ్లను స్క్రీన్ నుండి తిప్పకుండానే..
రాహుల్ నడుము నొప్పిని మర్చిపోయి ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. తన మొబైల్ తీసి కొన్ని ఫైల్స్ ఓపెన్ చేస్తూ, “హ్మ్మ్! నువ్వు చెప్పినట్టే ఆ ఇద్దరు అమ్మాయిల డీటెయిల్స్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేశా బావ..
అని అంటూ.. పక్కనే వున్నా కంప్యూటర్ స్క్రీన్ లో ఫైల్ ఓపెన్ చేస్తూ.. వాళ్ల డైలీ రొటీన్, వాళ్ళు రెగ్యులర్ గా వెళ్లే ప్లేసెస్ అన్నీ నోట్ చేసుకున్న అని అంటూ..
అప్పటి వరకు తన ట్రాకర్ లో రికార్డింగ్ అయినా వాయిస్ వింటూ.. చిన్నగా బ్లష్ అయినా రాహుల్ తను సీక్రెట్ గా కావ్య బ్యాగ్ లో ఫిక్స్ చేసిన ట్రాకర్ లో కావ్య వాయిస్ వింటూ బ్లష్ అవుతుంటే..
అతడు మాత్రం ఆ రికార్డింగ్ లో వున్నా జ్వాలా వాయిస్ ని ఆమె చెపుతున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ ని నిశితంగా వింటాడు..
ఆ అక్క, చెల్లెళ్ళ అల్లరి.. తిడుతూనే పిల్లలా భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లి.. కూతుర్లని వెనుకేసుకొని వస్తున్న తండ్రి.. ఒక కుటుంబం అంటే ఎలా ఉంటుందో ఆ ప్రేమ ఆప్యాయతలు పొందే అదృష్టం తమకి లేదు అని మనసులో బాధ పడుతూనే మరోవైపు..
తన కర్తవ్యం గుర్తు చేసుకుంటూ.. వాళ్ళకి వచ్చిన డీల్ ప్రకారం జ్వాలాని లాక్ చేయడానికి ఆమె బలం ఏంటో బలహీనత ఏంటో తెలుసుకొనే ప్రయత్నంలో రాహుల్ ని కావ్య ని గమనిస్తూ ఉండమని చెప్తాడు..
అదే ప్రాసెస్ లో దూరం నుండే కావ్యని స్టాక్ చేస్తూనే ఆమె అల్లరికి వేషాలకి కావ్యతో ప్రేమలో పడతాడు రాహుల్..
స్క్రీన్ మీద కనిపిస్తున్న జ్వాలా ఇంకా కావ్య ఫొటోస్ నే గమనిస్తారు ఇద్దరు.. వాళ్ళకి వచ్చిన డీల్.. జ్వాలా నుండి ఇన్ఫర్మేషన్ రాబట్టడం అది ఏ ఇన్ఫర్మేషన్ అనే విషయం వాళ్ళకి కూడా తెలీదు..
స్క్రీన్ మీద వున్నా కావ్య ని చూస్తున్నపుడు రాహుల్ కళ్ళలో కనిపిస్తున్న ఇష్టానికి అతడు సీరియస్ గా.. చూస్తుంటే.. అతడి సీరియస్ నెస్ ని తగ్గించేలా ఆమె నవ్వుతో మాయ చేస్తుంది జ్వాలా..
ప్రొఫెషనల్ లో పర్సనల్ ఇంట్రెస్ట్ ఆడ్ చేయకూడదు అనుకునే అతడిని మొదటి సారి కదిలించింది ఆమె నవ్వే!
మరి ఎవరు అతడు.. అతడి వల్ల జ్వాలా జీవితంలో ఎలాంటి మలుపు రాబోతుంది!
* * * * * * * * * * * * * * * * * * * * * *
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️
Swipe left/right or tap the sides to turn pages