New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్ – 23

లాస్య ఇద్దరి వైపు చూసి ఏడుస్తూ తను జై ధీర్ అంటూ ఉండగానే వాట్ అంటూ ఇద్దరు షాక్ అయ్యి పైకి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు…. మాన్య కి ప్రెసెంట్ ఎలా ఉందంటే బుర్ర గిర్రున తిరుగుతూ ఉన్నట్టు ఫీల్ అవుతూ అసలేం మాట్లాడుతున్నావ్ లాస్య నువ్వు చెప్పేది వర్మ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ సి. ఈ. ఓ. జై ధీర్ గురించా 🤷🤷 ఓహ్ గాడ్ నాకు నిజంగా బుర్ర వర్క్ అవ్వట్లేదు మీ ఇద్దరికీ ఎలా పరిచయం?? ఇంత వరకు ఎలా వచ్చింది & ఇంత జరుగుతున్నా మాకు ఒక్క మాట కూడా చెప్పాలి అనిపించలేదా నాకు నిజంగా ఇదంతా కలలా ఉందే అని తల పట్టుకుంటూ చెప్తుంది….

అది ఏడుస్తూ వాడి పేరు కూడా క్లియర్ గా చెప్తుంటే ఇంకా డ్రీమ్ అంటావేంటి పాప నీకేమైనా పిచ్చా….?? నేను వాడిని చూసినప్పుడే అనుకున్నా వాడు అమ్మాయిలను ఏడిపించే ఆవారా, పోకిరి , జులాయి, కాంత్రీ, కథర్నాక్ అని 😬😬 వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆద్య ఫ్రెండ్ తోనే పెట్టుకుంటాడు అని మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని లాస్య యూ డోంట్ వర్రీ ఇప్పుడే నేను వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని ఈడ్చుకొని వచ్చైనా సరే నీతో వాడికి పెళ్ళి జరిపిస్తా అని అరుంధతి సినిమా లో అనుష్కా లా చెప్తుంది….

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay