New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్-64

క్షమించండి అంకుల్ నాకు ఇష్టం లేదు అంటూ ప్రతాప్ వర్మ చేతుల్లో నుండి తన చేతిని వెనక్కి తీసుకున్న మహిదర్ వైపు చూస్తున్న ప్రతాప్ వర్మ మొహం లో అప్పటి వరకు ఉన్న నవ్వు మాయం అవుతుంది….. !! మహిదర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అర్థం అయింది మహిదర్ నువ్వు కూడా అందరి ఫాదర్స్ లాగే అలోచిస్తూ క్యారెక్టర్ లేని నా మనవడిని నీ కూతురికి ఇచ్చి పెళ్ళి చేయడానికి ఇష్ట పడ్డం లేదు అంతే కదా అని పేలవంగా నవ్వుతూ….. !! ఇందులో నిన్ను నేను తప్పు పట్టడం లేదు మహిదర్ మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది నువ్వు ఎందుకు వద్దు అంటున్నావో ఆ మాత్రం అర్థం చేసుకోగలను ఇట్స్ ఒకే వెళ్దాం పదా ఎలా జరగాలి అనుంటే అలానే జరుగుతుంది…… !!

అంకుల్ అంటూ ప్రతాప్ వర్మ చెయ్ పట్టుకుని ఆపేస్తూ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంకుల్….. !! జై కి క్యారెక్టర్ లేకపోవడం ఏంటి అంకుల్ ప్లీస్ ఇంకెప్పుడు జై ని తక్కువ చేయకండి వాడు బంగారం…… !! నేను వద్దు అన్నది జై అమ్మాయిలతో రిలేషన్ లో ఉంటాడని ఏమాత్రం కాదు …… !! జై కి ఆద్య అంటే ఇష్టం లేదు అలాగే ఆద్య కి కూడా జై అంటే నచ్చడు ఇన్ఫాక్ట్ ఆద్య కి పెళ్ళంటే ఇష్టం లేదు ఆ విషయం మీకు తెలుసా కదా….. !! ఇష్టం లేకుండా బలవంతంగా ఇద్దరికీ పెళ్లి ఎలా చేస్తాం చెప్పండి …. ?? అయినా వాళ్ళు ఈ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోరు ఒకవేళ ఒప్పుకున్నా పెళ్లి తర్వాత కలిసుంటారు అన్న నమ్మకం నాకు లేదు….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay