మాయ గుండెల్లో టెన్షన్ ఇంకా తగ్గలేదు అలాగే కంగారుగా నడుస్తూ…….. !! హాల్లో కి వచ్చేసరికి అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కనిపిస్తారు ………. !! వాళ్లను అలా చూసిన మాయ తను వీలైనంత నార్మల్ గా కనిపించడానికి ట్రై చేస్తూ మెల్లగా వెళ్ళి ఆధ్య పక్కన కూర్చుంటుంది……… !!
జై తన ప్లేట్‌లో ఉన్న ఫుడ్ తినబోతూ మాయ వైపు చూసి ……… !! మాయ ఎక్కడికి వెళ్లావ్? నాన్సీ వాళ్ళతోనే కదా వచ్చావ్ అందరం ఇక్కడికి వస్తుంటే నువ్వు సడెన్‌గా ఎక్కడికి మాయమైపోయావ్ ……. ?? అంటూ క్యాషువల్ గా అడుగుతాడు……… !!