New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 5

ఒప్పుకోని బంధం – 5

ఐదేళ్లుగా భార్య జ్ఞాపకాలతో ఒంటరిగా బ్రతుకుతున్న శౌర్య……… !!
మరో పెళ్లి చేసుకోమని తల్లి సీత ఎంత చెప్పినా వినడు…!!
కానీ ఓ రోజు తల్లి పెట్టిన ఒక కండిషన్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకుంటాడు…!!
అక్కడే అతని జీవితంలోకి అడుగుపెడుతుంది
23 ఏళ్ల శాన్వి………!!
ఫ్యామిలీ బాధ్యతలు మోస్తూనే తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నిలబడే అమ్మాయి…….!!
35 ఏళ్ల శౌర్య…!! 23 ఏళ్ల శాన్వి…!!
ఇద్దరి మధ్య పన్నెండేళ్ల ఏజ్ గ్యాప్…..!!
ఇద్దరి మధ్య అస్సలు కుదరని ఆలోచనలు…!!
మరి వీళ్లిద్దరి పెళ్లి ఎలా జరుగుతుంది…??
శౌర్య మనసులో ఉన్న గతాన్ని శాన్వి మార్చగలదా…??
లేక ఈ బంధం మొదలవ్వకముందే ముగిసిపోతుందా…??
అసలు శౌర్య–శాన్వి మధ్య ఏం జరగబోతోంది…?? ❤️ తెలుసుకోవాలి అంటే మనం స్టోరీ లోకి వెళ్లాల్సిందే………… !!

 

 

నాన్న నేను చెప్పింది ఏం చేశావు అని నీరసంగా అడిగిన తల్లి మాటలకు ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా ……… !!  మైండ్ అంతా డిస్టర్బ్ గా అనిపిస్తూ ఉండడం తో పై ఫ్లోర్ లోని తన రూమ్‌లోకి వెళ్లిపోయాడు సౌర్య…….. !!
అతని రూమ్ డోర్ దగ్గర నిలబడిన అతని తల్లి సీత శౌర్య బిహేవియర్ చూసి ఆవేశం ఆపుకోలేకపోయింది……… !!
తల్లి మాటకి కొంచెం కూడా వాల్యూ లేదా నాన్నా నీకు………….?? నీకు నీ పంతమే ఎక్కువైపోయింది కదా  నేను చచ్చే వరకు నీకు బుద్ధి రాదేమో……….. !! ఇంకెన్ని రోజులు ఇలా ఒంటరిగా, డిప్రెషన్‌తో ఉంటావు  అని కోపంగా అరుస్తుంది……….. ?!

 

శౌర్య నెమ్మదిగా పైకి లేచి  తన తల్లిని బెడ్ మీద పక్కన కూర్చోబెట్టుకుని …………. !! ఆమె ఒడిలో తల పెట్టుకొంటూ ఎందుకమ్మా పదే పదే ఇలా మాట్లాడుతున్నావు………..??  ప్లీజ్ చావు గురించి మాత్రం మాట్లాడకు నాకు అంటూ ఈ వరల్డ్‌లో ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా…………..!! పూర్ణి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు బాధగా………. !! శౌర్య తల నిమురుతున్న సీత  నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ………. !! అందుకే నాన్నా నిన్ను ఇంకో పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను………… !! నేను ఇంకెంతకాలం బతుకుతానో ఎవరికి తెలుసు నీకు ఇంకా ఏజ్ అయిపోలేదు ……….. !!  జస్ట్ ముప్పై ఐదు సంవత్సరాలే  అదేమంత పెద్ద ఏజ్ కాదు కదా……….. !! నీతో కలిసి లాంగ్ లైఫ్ జీవించే లక్ నీ ఫస్ట్ వైఫ్ పూర్ణికి లేకపోయింది………… !! అందుకని నువ్వు లైఫ్‌లాంగ్ తన మెమొరీస్‌తో ఇలా ఒంటరిగా ఉంటే………. !!  నిన్ను కన్న ఈ కడుపు ఎలా తట్టుకుంటుందిరా………?? రేపు నేను కన్నుమూస్తే నువ్వు కంప్లీట్‌గా ఒంటరివైపోతావు నాన్నా……….. !!

 

నా వల్ల పూర్ణిని మర్చిపోవడం పాజిబుల్ కాదమ్మా………. !!  నాకు ఇంకాస్త టైమ్ కావాలి అని సీరియస్‌గా అన్నాడు సౌర్య………. !! ఫైవ్ ఇయర్స్ నుండి ఇదే మాట చెబుతున్నావు ఒకే అలాగే నీ ఇష్టం బట్  నన్ను మర్చిపో………… !!  నేను మా అమ్మ ఇంటికి వెళ్లి ఉంటాను నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉండు……….. !! నీకు ఎప్పుడు రీమ్యారేజ్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు అక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్లు……….. !! అని కచ్చితంగా చెప్పి సీత అక్కడి నుంచి వెళ్లడానికి డిసైడ్ అయి పైకి లేచింది………. !! తన ఫాదర్ చనిపోయిన తర్వాత సింగిల్ మదర్‌గా ఎన్నో స్ట్రగుల్స్ పడి తనను తన చెల్లిని పెంచిన తల్లి ఇలా వదిలి వెళ్లిపోతానని అల్టిమేటమ్ ఇవ్వడంతో సౌర్య తట్టుకోలేకపోయాడు……… !! తల్లి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని తెలిసినా ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక మనసులో అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయినా పెళ్లికి ఓకే చెప్పాడు శౌర్య ………. !!

 

శౌర్య పెళ్లికి ఒప్పుకున్నాడని తెలిసిన వెంటనే సీతమ్మ ఆనందానికి లిమిట్స్ లేకుండా పోయాయి………. !! వెంటనే రిలేటివ్స్, మ్యారేజ్ కన్సల్టెంట్ ద్వారా ఫోటోలు, ప్రొఫైల్స్ పంపి ప్రాసెస్ స్టార్ట్ చేసింది…….. !! వారం రోజుల్లో ఒక అమ్మాయి జాతకం శౌర్య జాతకానికి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వడంతో ………. !! సీత స్వయంగా వెళ్లి అమ్మాయిని చూసి వాళ్ల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుని ఓకే చెప్పేసింది………. !! రేపు నా కొడుకు ను తీసుకుని వస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది……… !! సౌర్యకు ఇది కొంచెం కూడా నచ్చకపోయినా ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఆలోచించాడు………. !! అమ్మాయి నోటితోనే నాకు పెళ్లి ఇష్టం లేదు అని రిజెక్ట్ చేయిస్తే ఆటోమేటిక్‌గా ఈ ప్రపోజల్ క్యాన్సిల్ అవుతుందని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు…….. !!

 

శౌర్య సీత కి ఒక్కగానొక్క కొడుకు అతనికి అన్విత అనే చెల్లెలు కూడా ఉంది …….. !! తనకు మ్యారేజ్ అయి అబ్రాడ్‌లో సెటిల్ అయింది & సౌర్య ప్రెసెంట్ ఫైరీ క్రిమినల్ లాయర్………. !! అతని పర్సనాలిటీ, గంభీరమైన వాయిస్, కమాండింగ్ ఆటిట్యూడ్ కోర్టులో ఆపోజిట్ లాయర్లను సైతం షేక్ చేసేవి……… !! ఇప్పటివరకు అతను హ్యాండిల్ చేసిన ఏ ఒక్క కేసులోనూ ఫెయిల్ అయిన హిస్టరీ లేదు……… !! హార్ష్ అండ్ షార్ట్ టెంపర్ ఉన్న సౌర్య మొదటి పెళ్లి కూడా తల్లి చెప్పడం తోనే చేసుకున్నాడు……… !! శౌర్య మొదటి భార్య పూర్ణిమ రిచ్ అండ్ అహంకారం ఉన్న పర్సన్………. !! అత్తగారితో పడక పదే పదే పుట్టింటికి వెళ్లేది కానీ సౌర్యను మాత్రం పిచ్చిగా లవ్ చేసేది………. !! బలవంతపు పెళ్లే అయినా సౌర్య కూడా ఆమెను ప్రాణంలా ప్రేమించాడు…….. !! కానీ పెళ్లయిన రెండేళ్లకే అతని బర్త్‌డే రోజు హెవీగా డ్రింక్ చేసి కారు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్‌కు గురై స్పాట్‌లోనే చనిపోయింది………. !! సౌర్యకు కూడా సర్వైవల్ ఇంజ్యూరీస్ అయ్యాయి……….. !! ఆ ట్రాజెడీ జరిగి ఐదేళ్లు అయినా అతను మరొకరిని తన లైఫ్‌లోకి రానివ్వలేదు………… !!

 

మరుసటి రోజు తల్లితో కలిసి ఒక మిడిల్ క్లాస్ ఇంటికి అమ్మాయిని చూడటానికి వచ్చాడు సౌర్య……… !! వచ్చిన గెస్ట్ లకు వెల్కమ్ డ్రింక్ ఇవ్వడానికి అమ్మాయిని పిలిచారు………. !! సింపుల్‌గా ఒక ఆరెంజ్ కలర్ కాటన్ శారీ కట్టుకుని సౌర్య ముందుకు వచ్చిన ఆ అమ్మాయిని సౌర్య అస్సలు పట్టించుకోలేదు……… !! అమ్మాయితో పర్సనల్ గా కొంచెం మాట్లాడాలి అని సౌర్య అడగడం తో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్లిద్దరినీ బ్యాక్‌యార్డ్‌లోని గార్డెన్ వైపు పంపించారు………… !! అక్కడికి వెళ్లాక కూడా సౌర్య ఆ అమ్మాయ్ వైపు చూడకుండా గార్డెన్ వైపు చూస్తూ డైరెక్ట్‌గా పాయింట్‌కి వచ్చేశాడు…….. !!
లుక్ మిస్ నాకు ఈ మ్యారేజ్ అస్సలు ఇష్టం లేదు………. !! మా మదర్ ఎమోషనల్ ప్రెజర్ వల్ల మాత్రమే ఇక్కడికి వచ్చాను……… !! నా ఫస్ట్ వైఫ్ పూర్ణిని మర్చిపోవడం నాకు ఇంపాజిబుల్……… !! నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నా ఒక హజ్బెండ్ నుండి భార్యకు దక్కాల్సిన ఏ హ్యాపీనెస్, కేర్ నీకు దక్కవు………. !! ఇంట్లో మా అమ్మకు కోడలిగా ఉంటావు కానీ నా విషయంలో మాత్రం జస్ట్ ఒక కేర్‌టేకర్ లేదా పనిమనిషిలా బతకాల్సి వస్తుంది………. !! దట్స్ ఇట్ & ఎప్పటికీ నువ్వు పూర్ణి ప్లేస్‌ని రీప్లేస్ చేయలేవు……… !! సో నువ్వే బయటకెళ్లి నాకీ పెళ్లి ఇష్టం లేదు అని రిజెక్ట్ చెయ్………. !! ఇంతటితో ప్రపోజల్ క్లోజ్ అవుతుంది అని ప్రాక్టికల్ గా చెప్పేసి అక్కడి నుండి ఆ అమ్మాయ్ చెప్పేది కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ………. !!
ఇంట్లోకి తిరిగి వచ్చాక అందరూ వెయిట్ చేస్తున్నారు సౌర్య ఎం చెప్తాడా అని వెయిట్ చేస్తున్నారు…….. !! సౌర్య మాత్రం మైండ్ గేమ్‌ ఆడాలని చూస్తూ మా మదర్ ఛాయిసే నా ఛాయిస్……….. !! అయినా అమ్మాయి ఓపినియన్ కూడా ఇంపార్టెంట్ కదా…….?? తనకు ఓకే అయితే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు……… !!
అమ్మాయి తల్లి కనక ఆ అమ్మాయ్ వైపు చూస్తూ శాన్వి నీ డిసిషన్ ఏంటమ్మా అని అడిగింది…….. !!

 

శాన్వి ఒక్క క్షణం పాటు సౌర్య వైపు చూసి …….. !! నా……నాకూ ఈ పెళ్లి ఇష్టమే అని ఆన్సర్ ఇచ్చింది………. !! ఆ మాట వినగానే సౌర్యకు విపరీతమైన కోపం వచ్చింది……… !! వాట్ ద హెల్ ఇంత స్ట్రైట్‌గా చెప్పినా అలా ఎలా పెళ్లికి ఒప్పుకుంది అని ఆలోచిస్తూ …….. !! కళ్లతోనే శాన్వి ను చంపేసేలా చూశాడు కానీ తల్లి ముఖంలో ఆనందం చూసి ఏమీ మాట్లాడలేకపోయాడు……… !!

 

మిడిల్ క్లాస్ పేరెంట్స్ కనక, రాజీవ్‌లకు ముగ్గురు అమ్మాయిలు —ఆశ్రిత, శాన్వి, అనన్య……… !! సౌర్యతో పెళ్లికి ఒప్పుకున్నది సెకండ్ డాటర్ శాన్వి & డిగ్రీ కంప్లీట్ చేసిన 23 ఏళ్ల శాన్వి ……… !! పార్ట్‌టైమ్‌ డాన్స్ టీచర్‌గా చేస్తూనే ఒక సూపర్ మార్కెట్‌లో వర్క్ చేస్తూ ఫ్యామిలీ బాధ్యతలు మోస్తోంది……….. !! చాలా సన్నగా, ఫెయిర్ కలర్‌తో, పొడవాటి జడతో అరుదైన సాంప్రదాయ అందం ఆమెది……….. !! ఇద్దరి జాతకాలు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వడంతో పురోహితుడు పంచాంగం చూసి ………. !! నాలుగు నెలల తర్వాత ఒక మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు…….. !! అది విన్న శౌర్య ఈ ఫోర్ మంత్స్‌లో ఈ మ్యారేజ్ ఆపడానికి ఏదో ఒక ప్లాన్ వేయొచ్చు అని రిలీఫ్‌గా నిట్టూర్చాడు……….. !! శాన్వి మాత్రం మౌనంగా ఆలోచనల్లో పడింది……… !! నన్ను వార్న్ చేసిన ఆయన అందరి ముందు ఇంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారు……..?? అసలు ఆయన మైండ్‌లో ఏముంది……… ?? అని ఆలోచిస్తూ ఉంటుంది……… !!
కానీ ఇద్దరి ఆలోచన లకు విరుద్ధంగా సీత మాత్రం అంత లేట్ ఎందుకు శాస్త్రిగారూ………?? అర్జెంట్‌గా దగ్గర్లో ఉన్న డేట్ చూడండి అని తొందరపెట్టింది……… !! పురోహితుడు మళ్లీ పంచాంగం చూసి వచ్చే వారంలోనే ఒక దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పారు……… !!
అయితే ఆ ముహూర్తానికే ఫిక్స్ చేసేయండి అని సీత ఆనందంగా డిసైడ్ చేసింది………. !! అది విన్న శాన్వి పేరెంట్స్ టెన్షన్ పడుతుంటే ఈరోజే ఎంగేజ్‌మెంట్ కూడా చేసేద్దాం అని ఆర్డర్ వేసింది……… !!

 

సౌర్య తన తల్లి వైపు సీరియస్‌గా చూస్తూ …….. !! అంటే అంతా ఆల్రెడీ ప్లాన్డ్ అన్నమాట లాస్ట్ టైమ్ కూడా నీ ఛాయిస్‌కే వాల్యూ ఇచ్చాను ………. !! ఇప్పుడు కూడా నీ ఇష్టమే జరగనివ్వు కానీ ఫ్యూచర్‌లో ఎమ్ జరిగినా నన్ను మాత్రం బ్లేమ్ చేయకు అని వార్నింగ్ లాంటి టోన్‌లో చెప్పాడు……… !! అది విన్న సీత నవ్వుతూ పూర్ణిమ విషయంలో నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నాను……… !! కానీ ఈసారి నా సెలెక్షన్ వంద శాతం కరెక్ట్ అని కాన్ఫిడెంట్‌గా అంది………. !!

 

సౌర్య మనసులో మ్యారేజ్ అయిన వన్ మంత్‌లోనే నిన్ను ఈ ఇల్లు వదిలిపోయేలా చేయకపోతే నా పేరు సౌర్య కాదు……….. !! మైండ్ గేమ్స్ అంటే ఏంటో చూపిస్తా అని కసిగా అనుకుంటూ డ్రెస్ ఛేంజ్ చేసుకోవడానికి వెళ్లాడు………. !! అదే సమయానికి పట్టు చీరలో చిలకపచ్చ & పింక్ కాంబినేషన్‌లో శాన్వి దేవతలా నడుచుకుంటూ హాల్‌లోకి వచ్చింది………!! ఇప్పటివరకు ఆమెను సరిగ్గా గమనించని సౌర్య ఆమె నడిచి వస్తుంటే అలాగే చూసి ఒక్క క్షణం స్టన్ అయి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు……… !! శాన్వి అతని పక్కన నిలబడగానే రింగ్స్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది……… !! ముందుగా శాన్వి అతని వేలికి రింగ్ పెట్టగానే సౌర్య ఆమె వేలికి రింగ్ పెడుతూ కావాలనే ఆమె చేతిని చాలా గట్టిగా & పెయిన్ వచ్చేలా నలిపేశాడు……..!!శాన్వి అతని పట్టు నుండి చేయి విడిపించుకోవాలని ట్రై చేసింది…….. !! కానీ అతని గ్రిప్ క్షణం క్షణానికి మరింత టైట్ అయిపోతోంది…….. !! ఆ పెయిన్ తట్టుకోలేక ఫస్ట్ టైమ్ ఆమె తలెత్తి అతని కళ్లలోకి చూసింది………. !! దవడలు బిగించి కోపంతో నిప్పులు చెరుగుతున్న సౌర్య ఫేస్ చూసి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి………… !!

సౌర్య ఆమెకు మాత్రమే వినపడేలా చాలా లో-టోన్‌లో ……….. !! నేను నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను శాన్వి ఈ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదని ……… !! నీ అంతట నువ్వే ఈ ప్రాసెస్ ఆపేయమని క్లియర్‌గా చెప్పాను…….. !! నా మదర్ ఇమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి నన్ను ఒప్పించొచ్చు కానీ నువ్వు నో చెప్పొచ్చు కదా……..?? వై డిడ్ యు సే ఓకే హా ……. ??

శాన్వి పెదవి నొక్కిపెట్టి నొప్పిని దిగమింగుతూ అతని కళ్లలోకి నీళ్ళు నిండిన కన్నులతో చూసింది…….. !!

రిమెంబర్ వన్ థింగ్……. !! ఈ రింగ్ పెట్టినంత మాత్రాన నువ్వు నా లైఫ్ పార్ట్‌నర్ అయిపోవు……. !! యు ఆర్ జస్ట్ అన్‌వాంటెడ్ పర్సన్ ఇన్ మై లైఫ్……….. !! వన్ మంత్! జస్ట్ వన్ మంత్ టైమ్ ఇస్తున్నా నీకు………… !! వన్ మంత్‌లో నీకు హెల్ అంటే ఏంటో చూపించి నిన్ను ఈ ఇల్లు వదిలిపోయేలా చేయకపోతే నా పేరు సౌర్య కాదు……… !! ఆ మాట చెప్తూ సౌర్య ఆమె చేతిని ఒక్కసారిగా విసిరేసినట్లు వదిలేశాడు……… !! శాన్వి తన ఎర్రబడిన వేలిని చూసుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుంది………. !! సౌర్య కళ్లలో తనపై ఉన్న పగ, కోపం చూసి ఆమె గుండె తల్లడిల్లినా తన ఫ్యామిలీ కోసం ఆ నొప్పిని మౌనంగా భరిస్తూ నిలబడింది………. !!

అతను గతం వీడని ఒక విడోవర్…!!
ఆమె ఫ్యామిలీ బర్డెన్ మోస్తున్న సెల్ఫ్-రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి…!!
ఇద్దరి మధ్య పన్నెండేళ్ల ఏజ్ గ్యాప్…!!
ఇదీ… ఇద్దరి పంతాల మధ్య మొదలైన ఒక ఒప్పుకోని బంధం………!!
ఈ రిలేషన్‌షిప్ ఏ టర్న్ తీసుకుంటుంది…….. ??

 

కొత్త కథ… కొత్త అనుభూతి …!!❤️✨
మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేశాం……!! 😍
ఈసారి మనం ఎప్పుడూ ట్రై చేయని ఒక కొత్త జోనర్‌తో వచ్చాం… !!మరి ఈ కొత్త ప్రయత్నం మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది…….!!! 🥰
కథ చదువుతున్నప్పుడు మీకు ఏ సీన్ బాగా నచ్చింది….?? ఎవరి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది…..?? 👀❤️
ఏమైనా గెస్ చేశారా? మీ మైండ్‌లో ఏం అనిపిస్తుందో కామెంట్‌లో మాతో కూడా షేర్ చేయండి……!!
మిమ్మల్ని ప్రతిసారీ కొత్త కొత్త కథలతో ఎంటర్టైన్ చేయాలన్నదే మా ప్రయత్నం……!! ❤️
ఈ కథ కూడా మీకు కచ్చితంగా నచ్చుతుందని మాకు చాలా నమ్మకం ఉంది…..!! 😍
మరి కథ చదివేసి సైలెంట్‌గా వెళ్లిపోకండి……!! 😜
మీ ఫ్రెండ్‌కి చెప్పినట్టే మాతో కూడా మీ ఒపీనియన్ షేర్ చేయండి……!! 🥰
మీ కామెంట్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం……..!!❤️✨