పెళ్లి మండపం లోని సన్నాయి మేళాలు మోగుతున్నాయి …… !! మంగళకరమైన హోమధూపం చుట్టూ అల్లుకుంటోంది పురోహితుడు వేదమంత్రాల స్వరాన్ని పెంచుతూ ఉంటే ……… !! అగ్నిసాక్షిగా ప్రధాన ఘట్టం ముగిసేసరికి బంధువులందరి కళ్లూ ఆ మండపం మీదే ఉన్నాయి……. !! పురోహితుడు చేతిలోని అక్షింతలు నూతన వధూవరులపై చల్లుతూ ముహూర్త సమయం విజయవంతంగా పూర్తయింది………. !! పెళ్లి కూతురి ముఖంపై ఉన్న ముసుగును తీస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురి ముఖాన్ని చూసి తదుపరి శాస్త్రోక్త కార్యక్రమాలకు సిద్ధం కావాలి…….. !!