New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 1

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 1

బయట జోరుగా వర్షం పడుతోంది.

అది ఒక చిన్న Rent House.

Green colour సాదాసీదా చీర కట్టుకున్న ఒక తల్లి తన కొడుకును నిద్రపుచ్చుతోంది.

జో అచ్యుతానంద జోజో ముకుందా…
రారా పరమానంద రామ గోవిందా…జో… జో… జో…

అంటూ తన రెండేళ్ల చిన్న కొడుకుకు జోలపాట పాడుతూ నిద్రపుచ్చింది.

ఆ చిన్న మంచంపై తన కొడుకును హత్తుకుని, తానూ నిద్రపోయింది.

ఉదయం ఐదు గంటలకే అలారం శబ్దానికి లేచి,

తన కొడుకు రెండు వైపులా  pillows పెట్టి,

ఇంటి వెనుక ఉన్న washroom కి వెళ్లి కాలకృత్యాలు ముగించుకుని, Bath చేసి,

సాధారణ ఎరు చూడీదార్ వేసుకుని,

తన పొడవాటి జుట్టును టవల్‌తో చుట్టుకుని,

ఇంటి బయట చిన్న అందమైన ముగ్గు వేసి, పూజ చేసి,

తన కొడుకు దగ్గరకు వెళ్లింది.

చిన్న యువరాజు హాయిగా నిద్రపోతున్నాడు

ఆమె టైమ్ చూసింది.

6:30 అయింది.

అతని నుదుటిపై ముద్దుపెట్టి, టిఫిన్ Ready చేసింది.

అంతలో కొడుకు ఏడుపు వినిపించడంతో రూమ్‌లోకి వెళ్లింది..

రెండేళ్ల చిన్న బాబు అమ్మ కనిపించకపోవడంతో ఏడవడం మొదలుపెట్టాడు.

“ఏమైంది నా బంగారానికి? ఎందుకు ఏడుస్తున్నావు?” అంటూ ముద్దు చేస్తూ కొడుకును భుజంపై ఎత్తుకుని, బయట సూర్యరశ్మిలోకి తీసుకువచ్చి కొద్దిసేపు నడిపించింది.

“సాక్షి… ఇంకా నీ కొడుకు నిద్రలేవలేదా అమ్మా?” అని అడిగింది.

“లేదు ఆంటీ… ఇప్పుడే లేచాడు.”

“అవునా… టైమ్ అయింది కదమ్మా. 8 అయింది.. స్కూల్‌కి వెళ్లవా?”

అయ్యో… 8 అయిపోయిందా? సరే ఆంటీ… సాయంత్రం కలుస్తాను.” అని చెప్పి, కొడుకును Washroom కి తీసుకెళ్లి Bath చేయించి రెడీ చేసింది.

ఇంకా అతను రెండేళ్ల చిన్న బాబు కావడంతో, అతనికి తల్లిపాలు ఇచ్చింది.

కొడుకు నిద్రపోయిన తర్వాత,

గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని,

పొడవాటి జుట్టును జడ వేసుకుని,

నుదుటిపై ఒక బొట్టు పెట్టుకుని,

చెవులకు చిన్న రాళ్లతో ఉన్న చెవిపోగులు పెట్టుకుని,

తన  బ్యాగ్‌లో పుస్తకాలు.పెట్టుకుని సిద్ధమైంది.

అంతలోనే కొడుకు మళ్లీ లేచాడు.

అతనికి రాగి పిండితో చేసిన ఆహారం తినిపించి,

భుజంపై ఎత్తుకుని, బ్యాగ్ పట్టుకుని ఇంటికి తాళం వేసి దగ్గరలో ఉన్న  School కు వెళ్లింది.

School పక్కనే ఉన్న బేబీ కేర్ సెంటర్‌లో బాబును ఆయా చేతిలో ఇచ్చి,

School లోపలికి వెళ్లింది.

అది హై స్కూల్.

ఉదయం prayer  ముగిసిన తర్వాత,

ఆమెకు మొదటి క్లాస్ 10వ తరగతికి ఉంది.

“హే… సాక్షి మేడమ్ వచ్చారు.”

“సైలెంట్…”

ఆమె తరగతి గదిలోకి అడుగుపెట్టగానే, క్లాస్ లీడర్ అందరినీ నిశ్శబ్దంగా ఉండమంది.

“Good Morning  Students.”

“Good morning మేడమ్.”

ఆమె బోర్డు మీద “సబ్జెక్ట్” అని రాసి, దాని కింద “కన్నడ” అని రాసింది.

“నిన్న పద్యం పూర్తిచేశాం కదా Students . ఈరోజు ఏ Lesson  కావాలి?” అని అడిగింది.

“అహల్య కథ చెప్పండి మేడమ్.”

అని అందరూ ఒకేసారి అరిచారు.

తన చిరునవ్వుతో Lesson ప్రారంభించింది.

అహల్య కథను తన కథనే అన్నట్టుగా చెప్పి ముగించింది.

ఆ తర్వాత బోర్డు వైపు తిరిగి, కళ్లలోని కన్నీళ్లను తుడుచుకుంది.

తర్వాత attendence vesi , ఆఫీస్ రూమ్‌కి వెళ్లింది.

“ఓహ్… క్లాస్ అయిపోయిందా సాక్షి?”

“అవును పద్మజ మేడమ్, ఇప్పుడే అయిపోయింది. పన్నెండు గంటలకు ఒక క్లాస్ ఉంది. ఆ తర్వాత క్లాస్ లేదు. బాబును తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.”

“అవునా… సరే అమ్మా. జాగ్రత్త. ఆయుష్ ఎలా ఉన్నాడు? హాస్పిటల్‌కి ఎందుకు?”

“ఆయుష్ బాగానే ఉన్నాడు మేడమ్. కొంచెం దగ్గు ఉంది. అందుకే చూపించుకుని వద్దామని.”

“ఓకే.” అని చెప్పి పద్మజ మేడమ్ మరో క్లాస్‌కి వెళ్లిపోయారు.

సాక్షి తర్వాతి క్లాస్‌కి సిద్ధమవుతోంది.

అంతలో…

***********************************************************************************

 

Black colour కారు నుంచి ఆరు అడుగుల ఎత్తు, దృఢమైన శరీరం, గోధుమరంగు కళ్లతో ఉన్న అందమైన హ్యాండ్సమ్ హీరో దిగాడు.

అతను వేసుకున్న గ్రే రంగు సూట్ అతనికోసమే కుట్టించినట్టుగా ఉంది.

తన blezer ను సరిచేసుకుంటూ ఆఫీస్ ముందు నిలబడ్డాడు.

అతనే తన్మయి గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO.

తన చెల్లెలిపై ఉన్న ప్రేమతో ఆమె పేరుమీదే ఈ కంపెనీని స్థాపించాడు.

తన్మయి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు కర్ణాటకలో టాప్ వన్ కంపెనీ.

గర్వంగా చూసుకుంటూ లిఫ్ట్ ఎక్కి తన చాంబర్‌కి వెళ్లాడు.

అతని వెనుక ఫైళ్లు పట్టుకుని అతని పీ.ఏ. చేతన్ పరుగెత్తుకుంటూ వచ్చాడు.

“గుడ్ మార్నింగ్ బాస్.”

“హం… ఈరోజు ఏయే మీటింగ్స్ ఉన్నాయి చెప్పు.”

“ఫారిన్ క్లయింట్‌తో మీటింగ్ ఉంది సర్. అండ్ కొత్త ప్రాజెక్ట్ గురించి మీటింగ్ ఉంది.”

“ఓకే… నువ్వు వెళ్లు.”

అని చెప్పి తన ల్యాప్‌టాప్ చూస్తూ కూర్చున్నాడు.

చేతన్ బయటకు వచ్చి అతని తలుపు దగ్గర వేలాడుతున్న Board చూశాడు.

తారక్ రామ్
CEO of Tanmayi Group of Company
MBA in London University

చేతన్ విషాదంగా నవ్వుతూ, ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి,

“”అనుభవిస్తారు బాస్… మీరు చేసిన పనికి ఒకరోజు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. ఏ తప్పూ చేయని ఒక అమ్మాయికి నరకం చూపించారు…” అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

“హాయ్ తారక్…”

“హలో సమంతా.”

 తన్మయి నిన్న రాత్రి కాల్ చేసింది. ఈరోజు డిన్నర్‌కి తాజ్ హోటల్‌కి ఇన్వైట్ చేసింది. నువ్వు ఫ్రీగానే ఉంటావు కదా?”

“ఆఫ్‌కోర్స్. నా చెల్లెలి కోసం నేను ఎప్పుడూ ఫ్రీనే.”

“ఓకే. నువ్వు ఇప్పుడు వెళ్లు. నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ చేయాలి.”

“ఓకే తారక్… బై.” అని చెప్పి వెళ్లిపోయింది.

ఆమె వెళ్లిపోయిన తర్వాత…అతను కళ్లను మూసుకున్నాడు.

“ప్లీజ్… నాకేమీ చేయొద్దు సర్.” అని చేతులు జోడిస్తూ నిలబడ్డ అమాయకమైన అమ్మాయి అతనికి గుర్తుకు వచ్చింది.

ఆమె వ్యతిరేకిస్తున్నప్పటికీ…

ఆమె పెదవులకు తన పెదవులు కలిపిన సంఘటన గుర్తుకు వచ్చింది.

వెంటనే అతను ఒక్కసారిగా కళ్లను తెరిచాడు.

“I hate you సాక్షి… ఎందుకు నా జీవితంలోకి వచ్చావు?”

అని కోపంతో టేబుల్‌పై చేయి పెట్టి గట్టిగా కొట్టాడు.

అతని చేతికి గాయం అయి రక్తం వచ్చింది.

అది చూసిన అతని పీ.ఏ. చేతన్ పరుగెత్తుకుంటూ వచ్చి బ్యాండేజ్ చేశాడు.

అతను బ్యాండేజ్ చేసేంత వరకు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు.

సాయంత్రం ఉన్న మీటింగ్ ముగించుకుని అలసిపోయి కూర్చున్న వెంటనే అతనికి అతని చెల్లెలి నుంచి కాల్ వచ్చింది.

“అన్నయ్య… ఎక్కడ ఉన్నావు?”

“నేను, సంతోష్ already తాజ్ హోటల్‌లో ఉన్నాం. నువ్వు, సమంత ఎప్పుడు వస్తారు?”

“ఇంకో 1 గంటలో వస్తాను.”

“ఓకే అన్నయ్య… త్వరగా రా.”

అని చెప్పి కాల్ కట్ చేసింది.

అతను తన పీ.ఏ. వైపు చూశాడు.

అతను ఫైల్స్ అన్నీ బ్యాగ్‌లో పెడుతూ ఉన్నాడు.

తన blezer తీసి భుజంపై వేసుకుని కిందికి దిగాడు.

కారు ఎక్కి ఇంటికి వెళ్లాడు.

“అయోధ్య నిలయం”

కౌసల్య గారు కొడుకు వచ్చిన వెంటనే cooking  చేసే వాళ్లతో జ్యూస్ తయారు చేయమని చెప్పారు.

గుడ్ ఈవెనింగ్ మామ్, గుడ్ ఈవెనింగ్ తారక్, నేను లేడీస్ క్లబ్‌కి వెళ్తున్నాను. రావడం లేట్ అవుతుంది అని చెప్పి బై చెప్పి వెళ్లిపోతారు.

ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయి వచ్చే Time కి సమంత కూడా వచ్చి ఉంటుంది.

white colour  తన ఒంటికి అతుక్కుపోయిన షార్ట్ ఫ్రాక్ వేసుకుంది. మత్తెక్కించే అందంతో ఆమె చాలా అందంగా ఉంది.

“హాయ్ హ్యాండ్సమ్… షాల్ వి గో?” అని నవ్వుతూ అడిగింది. “హ్మ్…” అని తల ఊపుతూ అతను కారు స్టార్ట్ చేశాడు

నలుపు రంగు టీ-షర్ట్‌కి తెలుపు రంగు బ్లేజర్, కళ్లకు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని రఫ్ అండ్ టఫ్ హీరోలా ఉన్నాడు.

ఇద్దరూ తాజ్ హోటల్‌కి వచ్చారు.

తన్మయి, సంతోష్ ఉన్న చోటుకు వెళ్లారు.

“ఐ మిస్ యూ  అన్నయ్య.”

“మిస్ యూ టూ బేబీ.”

“అన్నయ్య… ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పు?”

“ఏంటి తను స్పెషల్?” అని సమంత తారక్ పక్కన కూర్చుని అడిగింది.

“నిన్ను నా ఫ్రెండ్‌గా, నా నాదినిగా పొందడం నా అదృష్టం అనుకున్నాను… కానీ వేస్ట్ కదా సామ్.”

“ఈరోజుకి Naku, సంతు పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు.”

“ఓహ్… సారీ సారీ. హ్యాపీ యానివర్సరీ.”అని సమంత ముందుకు వచ్చి తన్మయిని హత్తుకుని విష్ చేసింది.

కానీ వాళ్ల వెడ్డింగ్ యానివర్సరీ విని తారక్ షాక్ అయ్యాడు.

మూడు… సంవత్సరాలా?” అని మనసులోనే అనుకున్నాడు.

ఆ ఒక్క మాట…

అతని మనసులో మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను ఒక్కసారిగా కళ్లముందుకు తీసుకొచ్చింది.

ఆమెకు బలవంతపు పెళ్లి…

అతనికి… పరిస్థితుల వల్ల తప్పనిసరిగా జరిగిన పెళ్లి.

తన్మయి, సంతోష్, సమంతలకు మాత్రం లాభమే జరిగింది.

మొత్తానికి… మూడు సంవత్సరాల క్రితం తారక్‌తో సాక్షి పెళ్లి జరిగింది.

తారక్ ముఖంలో వచ్చిన మార్పును గమనించిన సమంత… వెంటనే తన్మయి వైపు సైగ చేసింది.

“ఓహ్… సారీ అన్నయ్య…. ఆ పెళ్లిని నువ్వు ఎలాగో మర్చిపోయావు కదా… వదిలేయ్.”

“ఇప్పుడు నా సంతోషమే నీకు ముఖ్యమైంది కదా.”

“హా… అవును.” అని చెప్పి ఇద్దరికీ విష్ చేసి,

“ఏం గిఫ్ట్ కావాలో అడుగు?” అని అడిగాడు.

అన్నయ్య… నువ్వు ఆఫీస్ వదిలేసి మాతో పాటు ట్రిప్‌కి రావాలి.”

“No తను… ఆఫీస్‌లో చాలా పని ఉంది.”

“ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య..”అని అడగడంతో,

“ఓకే.” అని ఒప్పుకున్నాడు.

“వావ్… థ్యాంక్యూ అన్నయ్య”అని సంతోషపడింది.

తర్వాత డిన్నర్ ముగించుకుని…

తారక్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లాడు.

మిగిలిన ముగ్గురు వాళ్ల ఇంటికి వెళ్లారు.

“సామ్… చూడు, నువ్వు చేసిన ఒక్క తప్పు ఎలా ఉందో.”

“నా మాట విని ఉంటే… నాతో పాటు నువ్వు కూడా ఈరోజు 3rd యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేదానివి.”

“స్టాప్ ఇట్ తను.”

“నాకు నా ఫ్యూచర్ ఇంపార్టెంట్‌గా అనిపించింది.మీ ఇంట్లో వాళ్లకి జాతకం ఇంపార్టెంట్ అయింది.”

“అందుకే అక్కడ Naku  తారక్ బదులు…”

“ఆ సాక్షి తారక్‌తో పెళ్లి జరిగింది.”

“ఛీ… ఆ దరిద్రపు సాక్షి పేరు చెప్పకు.

నాకు వాళ్లను చూస్తేనే అసహ్యం.

ఆమె నాకు కేవలం పేరుకే చెల్లెలు. నాకు ఆమెతో ఎలాంటి బంధం లేదు.

తప్పు తమలో పెట్టుకుని… అమాయకురాలైన సాక్షినే తిట్టారు.

అవన్నీ మాటలు చాటున నిలబడి విన్న తల్లి గుండె మాత్రం మౌనంగా ఏడుస్తోంది.

“అయ్యో… నా బంగారు తల్లీ… ఎక్కడ ఉన్నావమ్మా?

నా వల్ల నీ జీవితంలో సంతోషం అనే మాటే లేకుండా పోయింది తల్లీ…

ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండు…

ఈ మురికి ఇంటి వైపు మాత్రం తిరిగి రాకమ్మా…”

అని శాలిని కన్నీళ్లు పెట్టుకుంది.

“చాలు… లైట్ ఆఫ్ చేసి పడుకో. ఎప్పుడూ ఏడవడమే పని అయిపోయింది. ఛీ…”

అని రఘు తన భార్యను తిడుతూ పడుకున్నాడు.

 

To Be Continueed……………………….