New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
బీస్ట్ తో పెళ్లి-1

బీస్ట్ తో పెళ్లి-1

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేస్తున్న పెళ్లి…
లిమిటెడ్ బంధువులతో వాళ్లకి ఉన్న దాంట్లోనే బాగా చేస్తున్నారు శేఖర్ మాధవిలు తమ చిన్న కూతురు వివాహం.

స్వప్న! త్వరగా చెల్లిని తీసుకురా పంతులుగారు పిలుస్తున్నారు అని కేక వేసిన మాధవికి సరే అమ్మ అని పెళ్లికూతురిని తీసుకురావడానికి వెళ్ళింది స్వప్న పెళ్లికూతురి అక్క.

అద్దం ముందు తలదించుకొని కూర్చున్న ఆకృతి నీ చూస్తూ కొంపతీసి పెళ్లిలో నుండి వెళ్ళిపోయే ప్లాన్లు ఏమైనా వేస్తున్నావంటే అమ్మానాన్న చనిపోవడానికి కూడా వెనకాడరు చూసుకో నువ్వు కనుక ఇలాంటివి చేసావంటే అని అక్క బెదిరిస్తూ ఉండడంతో విసుగ్గా చూసిన ఆకృతి నాకు అలాంటి ఆలోచనలేమీ లేవులే కాకపోతే నేను ఇంకా జాబ్ చేయలేదు నువ్వేమో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. నేను కూడా వెళ్ళిపోతే నెక్స్ట్ అమ్మానాన్నల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను అంతే అక్క అయినా ఎప్పుడో చెప్పాను కదా నాన్న నిర్ణయమే నా నిర్ణయం అని అంటూ చేతిలోకి కొబ్బరి బొండం తీసుకుని పేరుకి స్వప్న చేయి పట్టుకుంటే వచ్చి మండపంలో కూర్చుంది ఆకృతి.

ఆమె కూర్చోగానే ఇద్దరి మధ్య అడ్డుతెర పెట్టించేశారు పంతులుగారు.

నార్మల్ గా ఉన్న మనసుతోనే పంతులుగారు చెప్పిన పూజలన్నీ చేస్తూవుంది ఆకృతి.

ఇటువైపు ఉన్న పెళ్ళికొడుకు మాత్రం ఎప్పుడెప్పుడు ఆకృతి మెడలో తాళి కడతానా తను ఎప్పుడు నా సొంతం అవుతుందా అన్న ఆలోచనలోనే ఉన్నాడు.

పెళ్ళికొడుకు కాళ్లు పళ్లెంలో పెట్టగానే పంతులుగారు కన్యాదానం చేయండి అన్న మాటకు శేఖర్ మాధవిలు పెళ్ళికొడుకు కాళ్ళని కడిగాక ఇద్దరి చేతుల్లో జిలకర బెల్లం పెట్టిన పంతులుగారు ఒకరి తలమీద ఒకరు పెట్టుకోండి అని చెప్పేలోపు హాల్ మొత్తం నిశ్శబ్దంగా జరిగే పెళ్లిని చూస్తూ ఉంటే అప్పటికి ఇంకా బాజా బజంత్రీలు కూడా మోగలేదు.

కానీ పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ హాల్ మధ్యలో నుండి వస్తున్న ఆరడుగుల రూపాన్ని చూసి శేఖర్ వినయంగా పైకి లేచి నిర్వాన్ బాబు అని పిలిచే లోపు షూస్ ఉన్న కాళ్లతోటే మండపం ఎక్కిన అతను పెళ్లికూతురు రెక్క పట్టుకొని పైకి లేపి కలసానికి పెట్టిన మంగళ సూత్రాలు గుచ్చిన పసుపు తాడు తీసి ఆమె మెలో మూడు ముళ్ళు వేసేశాడు ఎవరు ఊహించనట్లు.

క్షణాల్లో ఏం జరిగిందో ఆకృతికి తెలిసేలోపు గుండెల మీద మెరుస్తూ కనబడ్డాయి పచ్చని సూత్రాలు.

ఫంక్షన్ హాల్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతుండగానే అందరిని మరికొంచెం షాక్ కి గురి చేస్తూ కుంకుమ తీసి ఆకృతి పాపిట్లో పెట్టాక పాకెట్ లో ఉన్న బ్లాక్ బీడ్స్ కూడా తీసి మెల్లో వేసేసాడు నిర్వాన్.

బాబు మీరు అంటూ శేఖర్ తన యజమాని అన్న గౌరవంతో అలాగే కూతురి భవిష్యత్తు నాశనం చేశాడు అన్న భావంతో ఎటు తేల్చుకోలేక అడుగుతుండగానే ఎవరి వైపు చూడకుండా ఆకృతి చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు అతను.

ఇటువైపు ఉన్న పెళ్ళికొడుకు మాత్రం పైకి లేచి ఎంత నటించారు నా దగ్గర ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించినా కూడా నాకు అంట కట్టాలని చూసారే మిమ్మల్ని ఊరికే వదలను పోనీలే లేని వాళ్ళు అని మా అమ్మానాన్నలను ఒప్పించి రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుందామని వస్తే ఇదా మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఆ అబ్బాయి అంతగా పెళ్లి చేసుకుని వెళ్ళాడంటే ఈపాటికి ఎన్నిసార్లు వాడితో సుఖపడి ఉంటుందో నీ కూతురు అని అన్న పెళ్లి కొడుకు ఎగిరెల్లి ఆకృతి కాళ్ల దగ్గర పడ్డాడు నిర్వాన్ కొట్టిన దెబ్బకి.

కళ్ళు బైర్లు కమ్మి ఆ పెళ్ళికొడుకు పడిపోతే మిమ్మల్ని మేము ఊరికే వదిలిపెట్టము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము పరువు దావ కేసు కింద అని పెళ్ళికొడుకు తల్లి రంకెలు వేస్తూ నిర్వాన్ చూసిన చూపుకి భయపడి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది.