వేచానయ్య నీకోసం 🤍 – 3
దాంతో దుర్గమ్మ ఆలోచనలో పడితే “అమ్మాయి చెప్పిన ఆలోచన కూడా బాగుంది… గాయత్రి లేకుండా మనము ఉండలేము తను ఉండలేదు కానీ అలాగని ఊరుకుంటే ఈరోజు లాగే ఎప్పుడు పెళ్లి విషయం వచ్చిన కూడా ఏడుస్తూనే ఉంటుంది…. పెద్దమ్మాయి దగ్గరికి పంపిస్తే సిటీలో ఎలా ఉండాలి ఏంటి అనేది మన కావ్య అమ్మాయి గాయత్రి కి నేర్పిస్తారు” అన్నారు రామయ్య గారు….
“సరేనండి!! మీరు అమ్మాయి ఇంతలా చెబుతున్నారు కాబట్టి అలాగే చేద్దామని” దుర్గమ్మ కూడా ఒప్పుకోవడంతో “సరే ఎలాగో దసరా వస్తుంది కాబట్టి పండుగకి వచ్చి మేము వెళ్లేటప్పుడు గాయత్రిని తీసుకొని వెళ్తాము… కానీ మాతో రావడానికి మీరు ఇప్పటి నుంచే గాయత్రిని సిద్ధం చేయడం మంచిది” అని చెప్పి ఆవిడ ఫోన్ కట్ చేసింది….
దుర్గమ్మ గారు రామయ్య గారు ఒకరినొకరు చూసుకుని ఏదో స్థిర నిర్ణయానికి వచ్చినట్టు నిద్రపోవడానికి వెళ్ళిపోయారు….
***************
ఉదయాన్నే వంట గదిలో హడావిడి చూసి “ఏంటి అమ్మమ్మ ఇంత హడావిడి చేస్తున్నావని?” గాయత్రి వంటగదిలోకి వెళ్ళగానే “దసరా దగ్గరికి వస్తుంది కదా… పెద్దమ్మ వాళ్ళు ఇంటికి వస్తున్నారు…అందుకే పిండి వంటలు చేస్తున్నాను” అంది…..
“నన్ను ఏమైనా సహాయం చేయమంటావా?” అని గాయత్రి అడగడంతో “రా నువ్వు కూడా చేయి వేస్తే త్వరగా అయిపోతాయని” చెప్పడంతో సరేనంటూ అమ్మమ్మతో కలిసి తను కూడా పిండి వంటలు చేయడం ప్రారంభించింది….
“అన్నట్టు ఇక్కడ టౌన్ కాలేజీలో చదువుకున్న నీకు పెద్దగా చదువు బుర్రకక్కడం లేదు కాబట్టి కావ్య తో పాటు నిన్ను కూడా చదివిస్తానని మీ పెద్దమ్మ చెప్పింది” అంది దుర్గమ్మ….
ఆ మాట వినగానే గాయత్రి చేస్తున్న పని ఆపేసి “నేను ఎక్కడికి వెళ్ళను” అని మొహం ఏదోలా పెట్టుకోవడంతో “పెద్దమ్మ అంటే నీకు ఇష్టం లేదా? తను నిన్ను ప్రేమగా చూసుకోవడం లేదా అనగానే చూసుకుంటుంది కానీ నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదమ్మమ్మ” అంది….
“నువ్వు అలా చెబితే పెద్దమ్మ బాధపడుతుంది తర్వాత నీ ఇష్టం” అనగానే “అమ్మమ్మ ఎందుకిలా నన్ను ఇరకాటం లో పెడుతున్నావని” గాయత్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో “నా తల్లి కదూ కొన్ని రోజులు అక్కడ ఉన్నావు అనుకో నువ్వు కూడా దిగులు మానేసి జనాల్లో పడతావు… మీ పెద్దమ్మ కూడా పెళ్లికి ముందు వరకు ఊరు దాటలేదు కానీ ఇప్పుడు హైదరాబాద్లో సంతోషంగా ఉంది కాబట్టి నువ్వు కూడా అక్కడ అలవాటు పడు…కావ్యతో కాలేజీకి వెళ్ళు” అని చెప్పింది…
“ఇక్కడ కాలేజీలో నేను బాగానే చదువుతున్నాను కదా” అనగానే *నువ్వు చదువుతే సరిపోదు నీకు చదువు చెప్పే వాళ్ళు కూడా బాగా చెప్పాలి కాబట్టి హైదరాబాద్ వెళ్తే బాగుంటుంది…సరేలే వాళ్ళు వచ్చినప్పుడు సంగతి” అని అప్పటికి టాపిక్ డైవర్ట్ చేసింది దుర్గమ్మ…..
ఇంకొకచోట ఆర్యన్ అన్నట్టుగానే ట్రైనింగ్ కి వెళ్లడం మొదటి రోజు నుంచి మొదలు పెట్టాడు… అందరూ రెండు మూడు గంటలు ప్రాక్టీస్ చేసి డీల పడిపోయినా కూడా ఆర్యన్ మాత్రం చాలా యాక్టివ్ గా మొదటి రోజే నైన్ అవర్స్ ప్రాక్టీస్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆల్రెడీ అతనికి చాలా కాంపిటీషన్స్ విన్ అయిన ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఇది అతనికి ఈజీ అని వాళ్లకు అర్థమైంది…
సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసి ఎవరితో మాట్లాడకుండా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్లిపోయిన ఆర్యన్ వైపు చూస్తూ “హి ఈజ్ డిఫరెంట్” అనుకున్నారు అందరూ…..
ఆర్యన్ ఇంటికి రావడంతో “ఎక్కడికి వెళ్లావు నాన్న? చెప్పకుండా వెళ్లావని” కావేరి అడగడంతో “నేను కొత్త స్పోర్ట్స్ సొసైటీలో జాయిన్ అయ్యాను… అక్కడే ప్రాక్టీస్ చేసి వస్తున్నానని” చెప్పాడు…
ప్రాక్టీస్ ఎక్కువైపోయేసరికి అలసిపోయినట్టుగా ఎర్రబడిన కొడుకు మొహం చూసి “వెళ్లి ఫ్రెష్ అయ్యిరా వేడివేడిగా కాఫీ ఇస్తానని” చెప్పడంతో *కాఫీ కాదు ఐ వాంట్ జింజర్ వాటర్” అని చెప్పడంతో “అది ఉదయం తాగాలి రా. ఈవినింగ్ కాదు” అంది ఆవిడ…
“నో కాఫీలో మిల్క్ ఉంటుంది మిల్క్ అంటే కొలెస్ట్రాల్ నేను తీసుకోలేను” అని చెప్పడంతో “సరేలే ఏదో ఒకటి నువ్వు రిఫ్రెష్ అయితే చాలు” అని చెప్పి ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోతే ఆర్యన్ ఫ్రెష్ అయ్యి కిందికి రావడంతో “ఎందుకురా ఇలా ఫుట్బాల్ ఫుట్బాల్ అంటూ ఒళ్ళు అలసిపోయేలా కష్టపడుతున్నావ్… మీ నాన్న బిజినెస్ చూసుకోవచ్చు కదా” అంటూ కిందకి వచ్చిన మనవడిని చూస్తూ అడిగింది నాన్నమ్మ..
“అత్తయ్య వాడికి బిజినెస్ ఇంట్రెస్ట్ లేదని తెలిసి మీరు మీ అబ్బాయి ఎందుకు వాడ్ని ఇబ్బంది పెడుతున్నారు” అనగానే “నేను ఇబ్బంది పెట్టడం లేదే… హాయిగా ఏసీ గదిలో కూర్చుని సంతకాలు పెడితే సరిపోయే దానికి ఇంత కష్టపడడం దేనికి” అనగానే “సంతకాలు పెట్టడానికి వెనుక కూడా చాలా కష్టం ఉంటుంది అత్తయ్య… ఏ విషయంలో అయినా మన ఇంట్రెస్ట్ లేకుండా అది ముందుకు వెళ్ళదు” అంది….
కంటిన్యూస్!!!
Swipe left/right or tap the sides to turn pages