వేచానయ్య నీకోసం 🤍 – 2
Vn 2
గాయత్రి దగ్గర నుంచి కాఫీలు తీసుకున్న పెద్దవాళ్ళు అందరూ “పిల్లకి పెళ్లి వయసు వచ్చింది కదా రామయ్య గారు…. మరి సంబంధాలు ఏమీ చూడటం లేదా… మా కూతురి మరిదికి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది… మీకు అభ్యంతరం లేదంటే మా అమ్మాయితో మాట్లాడుతాను” అన్నాడు ఒక పెద్ద మనిషి…
“పెళ్లి సంబంధాలు చూడాలని మాకు కూడా ఉంది వీరయ్య గారు కానీ చిన్నప్పటి నుంచి పల్లెటూర్లోనే పెరిగింది… తల్లిదండ్రులు లేని పిల్ల కాబట్టి తండ్రి లాగా బాధ్యతగా తల్లిలాగా ప్రేమగా తోడబుట్టిన వాళ్ళలాగా స్నేహంగా మొత్తానికి ఎంత కష్టం వచ్చినా చెయ్యి వదలని వాడి కోసం చూస్తున్నాము…
పోనీ ఇక్కడే ఎవరినైనా ఇద్దామంటే మా బ్రతుకు ఇక్కడే తెల్లారిపోయింది… అమెరికా సంబంధాలు నమ్మకం లేదు కాబట్టి కనీసం హైదరాబాదులో ఉండే పిల్లాడి కోసం చూస్తున్నాం” అన్నాడు రామయ్య….
“మన గాయత్రి బంగారు తల్లి… తనకి రాజకుమారుడు వస్తాడని” మరొక పెద్దమనిషి చెప్పడంతో రామయ్య గారి చిన్నగా నవ్వుకుంటే గాయత్రి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది…..
వంట గదిలోకి వచ్చి మౌనంగా నిలబడిన మనవరాలి వైపు చూస్తూ “ఏమైందమ్మా?” అని అమ్మమ్మ అడగడంతో “తాతయ్యతో అక్కడ అందరూ నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు” అంది…
“తప్పేముంది… నీ వయసుకి నాకు పెళ్లయిపోయి మీ అమ్మ పెద్దమ్మ మామయ్యలు అందరూ పుట్టి బడికి కూడా వెళ్తున్నారు” అని చెప్పింది ఆవిడ….
గాయత్రి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో “ఏమైందమ్మా?!” అని ఆవిడ మళ్ళీ అడిగేసరికి “నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను అమ్మమ్మ” అని ఏడ్చింది….
“అయ్యో పిచ్చిదానా!!! ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా?” అంటూ మనవరాలు కళ్ళు తుడిచి “ఆడపిల్లగా పుట్టాక ఎవరైనా పెళ్లి చేసుకొని పుట్టినింటి గడప దాటాల్సిందే” అంది..
“లేదు… నేను మీతో పాటే ఉండిపోతానని” గాయత్రి ఏడుస్తుంటే ఇంకా ఆ విషయాన్ని రెట్టించకుండా మనవరాలిని ఓదార్చి పండుగ కోసం చేసిన జంతికలు అరిసెలు చేతిలో పెట్టడంతో వాటిని అన్యమనస్కంగానే ఏదో తింటున్నట్టుగా ఎలక కొరికినట్టు చిన్నచిన్నగా తింటూ కూర్చుంది…
ఆవిడ మనవరాలిని గమనిస్తూనే పనిలో మునిగిపోయింది….
మరొకవైపు ఆర్యన్ చెప్పినట్టుగా మర్నాడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సొసైటీకి వెళ్లి ఫార్మలిటీస్ కంప్లీట్ చేసి మేనేజర్ తో మాట్లాడడానికి వెళ్లడంతో “ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు కాబట్టి ఈరోజు నుంచి కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మీకు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది…. ప్రతిరోజు ఆరు గంటలకి వచ్చి కొద్దిసేపు వార్మ్ అప్ చేశాక కనీసం 8 గంటలైనా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి” అని చెప్పడంతో ఆర్యన్ సరే అన్నాడు….
“అయితే రేపటి నుంచి ట్రైనింగ్ కి రావడం స్టార్ట్ చేయండి… మీరు ఇంటి దగ్గర నుంచి వస్తానని చెప్పినా పర్వాలేదు లేదా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది” అనగానే “నో నీడ్ మా ఇల్లు ఇక్కడే” అని ఆర్యన్ చెప్పడంతో “ఓకే టైంకి వచ్చేయండి” అని చెప్పాడు మేనేజర్….
****************
ఆరోజు రాత్రి గాయత్రి వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా వాళ్ళ పెద్దమ్మ వీడియో కాల్ చేయడంతో తాత అమ్మమ్మ మాట్లాడుతూ ఉంటే గాయత్రి మౌనంగా ఉండేసరికి “ఎప్పుడు గలగల మాట్లాడే మన గాయత్రి మౌనంగా ఉంది ఏంటి?” అని పెద్దమ్మ ముద్దుగా అడగడంతో వాళ్ళ అమ్మమ్మ మౌనంగా ఉంటే రామయ్య గారు కూడా “నిజమేనే గాయత్రి ఉదయం నుంచి అంత ముభావంగా ఉందేంటి?” అన్నాడు….
,xఉదయం ఊరి పెద్ద మనుషులు మాట్లాడడానికి వచ్చినప్పుడు గాయత్రి పెళ్లి గురించి మాట్లాడడం విని నేను పెళ్లి చేసుకోను మీతోనే ఉంటానని ఏడుస్తూనే ఉండని” చెప్పింది ఆవిడ….
ఆ మాటకి ఆయన మనవరాలు వైపు ఆశ్చర్యంగా చూడ్డంతో గాయత్రి మౌనంగా ఉంటే “అమ్మ గాయత్రి తాతయ్య గారికి కొంచెం మజ్జిగ తీసుకొని రా” అని వీడియో కాల్ లో ఉన్న వాళ్ళ పెద్దమ్మ చెప్పడంతో ఆమె సరే అని చెప్పి వంట గదిలోకి వెళ్లడంతో “అమ్మ ఇలాగే ఉంటే గాయత్రి పెళ్లి చేసుకోవడానికి నిజంగానే మొండి చేస్తుంది…
ఇక్కడ కావ్య తోపాటు చదువుకుంటుంది ఇక్కడికి పంపించండి” అనగానే “దానికి చదువులు ఎందుకే పైగా మీ చెల్లెలు చనిపోతూ నా చేతిలో పెట్టిన తర్వాత దానికి ఊహ తెలిశాక ఈ ఊరి నుంచి బయటకు ఎప్పుడు అడుగుపెట్టిందే లేదు” అంది…
“అబ్బా అమ్మ నా పెళ్ళి వరకు నాకేమైనా ఊరు బయట వెళ్లడం తెలుసా? అలాగే చెల్లికి దాని పెళ్లి వరకు ఊరు దాటి వెళ్లడం తెలుసా. పెళ్లయ్యాక కాపురానికి మేము కూడా సిటీకి వచ్చిన వాళ్ళమే కదా… కావ్య తో పాటు చదువుకుంటుంది కాస్త సిటీ కల్చర్ కి అలవాటు పడిందంటే ఇక్కడే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం” అంది ఆవిడ…
“కానీ గాయత్రి రావడానికి గొడవ చేస్తుంది” అనగానే “అదంతా నేను చూసుకుంటాను… మీరు కూడా ఇప్పటినుంచే దాన్ని సిటీకి పంపడానికి ముందే సిద్ధం చేస్తూ ఉండండి…. కచ్చితంగా నేను దాన్ని తీసుకొని వెళ్తాను” అంది ఆవిడ…
కంటిన్యూస్!!!!
Swipe left/right or tap the sides to turn pages