New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మహారాణా ప్రతాప్ – 1

మహారాణా ప్రతాప్ – 1

మహారాణా ప్రతాప్ – 1

భారతదేశ చరిత్రలో ధైర్యం, శౌర్యం మరియు త్యాగానికి ఎంతో స్ఫూర్తిదాయకం అతను.

మేవార్ యొక్క సిసోడియా రాజ వంశంలో బాప్పా రావాల్, రాణా హమీర్, రాణా సంగా వంటి ఎంతో మంది గొప్ప రాజులు పరిపాలన చేశారు.

వారందరినీ రాణా అని పిలిచేవారు. కానీ ఒక్క వ్యక్తిని మాత్రమే  “మహారాణా” అన్న పేరుతో గౌరవించారు.

చాలా మంది ధైర్యవంతులు అయిన రాజ్ పూత్ రాజులు, మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఇచ్చిన ప్రలోభాలకు లోబడి అతని ఆధిపత్యాన్ని స్వీకరించి దాసోహం అయ్యారు.

రాజస్థాన్ మాత్రమే కాదు. భారతదేశం మొత్తం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయింది.

ప్రతీ ఒక్క రాజు అక్బర్ కి తలోంచాడు. ఇలాంటి కష్టతరమైన సమయంలో మాతృభూమి స్వేచ్ఛను కాపాడడానికి ఒక్క రాజ్ పుత్ రాజు మాత్రం నేనున్నాను అంటూ దేశానికి ధైర్యాన్ని అందించాడు.

అతను ధైర్యం, శౌర్యం, త్యాగం, దయ మరియు ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండి, మొఘలుల నుండి భారత దేశాన్ని మరియు హిందూ మతాన్ని రక్షించడానికి జీవిత కాలం అంతా స్వచ్ఛ కోసం పోరాడాడు.

నిజానికి అతని ముందు గాని, అతని తరువాత గాని అలాంటి యోధుడు పుట్టలేదు.

అతనిని భరతమాత వీర పుత్రుడిగా పిలిచారు.

అతని పేరు మహా రాణా ప్రతాప్ సింగ్..

మహారాణా ప్రతాప్ సింగ్ గొప్పతనం చెప్పడానికి రెండు ఉదాహరణలు..

అబ్రహం లింకన్ భారతదేశ పర్యటన నిమిత్తం భారత దేశానికి రావాల్సి ఉంది.

అతను భారతదేశానికి బయలుదేరుతూ తన తల్లిని  ” భారతదేశం నుండి ఏమి తీసుకొని రావాలి ” అని అడిగాడు.

దానికి అతని తల్లి  ” రాజస్థాన్ లోని మేవార్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా.. అక్కడి రాజు ఎంత విశ్వాస పాత్రుడుగా ఉండేవాడు అంటే సగం భారతదేశాన్ని ఇస్తాను అని అక్బర్ ప్రలోభ పెట్టినా తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు ” అని చెప్పింది.

కానీ కొన్ని కారణాల రీత్యా లింకన్ పర్యటన రద్దు అయింది.

ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి.

ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్ధంలో ఆఖరికి అమెరికాని ఓడించింది.

అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.

” ఇప్పటికీ అర్ధాంకాని విషయమేమిటంటే, అమెరికాని ఓడించి యుద్ధంలో ఎలా గెలిచారు ”

” అన్నీ దేశాలలోకెల్లా శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టమైన దేశభక్తి గల భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని జీవనం నుండి ప్రేరణపొంది యుద్దనీతి, ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్ధంలో గెలిచాము. ”

” ఎవరా భారతీయ మహారాజు? ”

వియత్నాం అద్యక్షుడు నిలబడి గర్వంతో,  ” అతడే రాజస్తాన్ లోని మేవార్ మహారాజు మహారాణా ప్రతాప్ సింగ్ ” అని అన్నాడు. మహారణా ప్రతాప్ సింగ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళలో వీరత్వం నిండి వెలుగు కనబడింది.

” ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే, ఈపాటికి మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం. ” అంటూ చెప్పాడు.

కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు. అయితే అతని సమాధి మీద  ” ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది ” అని రాసి పెట్టారు.

కాలాంతరంలో వియత్నాం విదేశాంగ మంత్రి భారతదేశ పర్యటనకి వచ్చాడు. మహామహులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ గారి సమాధి అతనికి చూపించారు. ఆ తరువాత ఎర్రకోట, ఇంకా చాలా చూపించారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగ మంత్రి,  ” మహారణా ప్రతాప్ గారి సమాధి ఎక్కడ? ” అని అడిగాడు.

ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్ లో ఉన్నదని చెప్పాడు.

విదేశాంగ మంత్రి అక్కడ నుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి సమాధి పక్కన ఉన్న పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.

ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు.

” ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది. ఈ మట్టిని తీసుకెళ్లి మా దేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారాణా ప్రతాప్ గారు ఈ దేశమే కాదు, ప్రపంచమే గర్వించదగ్గ రాజు ” అని అన్నాడు

మహారణా ప్రతాప సింగ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది. చేతి కవచం, శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి.

అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.

అతను సాటిలేని ఒక గొప్ప యోధుడు. చాలా ప్రతికూల పరిస్థితులలో కూడా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసాడు.

ఇది సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేరు. మేవార్ మహారాజు అయినప్పటికీ అతని జీవితంలో ఎక్కువ భాగం అడవులు మరియు పర్వత ప్రాంతాలలోనే గడిపారు.

తన అత్యున్నత సంకల్ప శక్తి మరియు సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో మేవార్ ని శత్రువుల భారీ నుండి విడిపించగలిగాడు.

తన ఆనందం మరియు లాభాలను త్యాగం చేస్తూ, మాతృభూమి స్వాతంత్ర్యం కొరకు నిరంతరం కష్టపడ్డాడు. ఇది చరిత్రలో ఒక సువర్ణధ్యాయం.

అతని వ్యక్తుత్వం మరియు మాతృ భూమి పై గల అపారమైన ప్రేమ, నేడు జాతీయ స్పృహ తగ్గిపోతున్న సమాజానికి ఎంతో ఆదర్శం.

అతను చనిపోయే వరకు మేవార్ జండా ని పైకి ఎత్తి నిలబడ్డాడు.

దాని కారణంగా అతను మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా ఎన్నో అవస్థలు మరియు దుఃఖానికి గురి కావలసి వచ్చింది.

అలాంటి గొప్ప రాజు మన దేశంలో పుట్టడం మన దేశానికి గర్వకారణం. కానీ అంత గొప్ప వీరుడి గురించి మీలో ఎంతమందికి తెలుసు?

ఇంతకీ ఎవరు ఈ మహారాణా ప్రతాప్ సింగ్?

అంత పెద్ద మొఘల్ శక్తిని ఏ విధంగా ఎదురుకున్నాడు?

అసలు ఈ మేవార్ లో రాణా ప్రతాప్ వంశం ఎలా మొదలైంది. అందులో ఉన్న గొప్ప వీరులు, వీరనారీమణులు ఎవరు?

ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి!

వెళదామా? ఒక గొప్ప భారతీయ రాజు అయిన మన మహారాణా ప్రతాప్ సింగ్ గారి జీవితంలోకి?

 

ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మీరు మాత్రమే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా చదవమని చెప్పండి.

ఎందుకంటే అంత గొప్ప వీరుడి కథను వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలని నా కోరిక..

ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలతో నన్ను ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు!  మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹’