నీలి చిత్రం మాటు – 3
ఒకపక్క ప్రదీప్ మీద కోపం మరొకపక్క అంతకు అంతకు ఇబ్బంది పెడుతున్న తన ఫీలింగ్స్.
వీటి మధ్య కోపం, ఆక్రోశం రెండు గుండెల్లో ఎగసి కళ్ళల్లో కన్నీళ్లు కనురెప్పలు దాటి చెంపలు మీదకు జారుతుంటే రెండు గంటల ఆ ప్రోగ్రాం కోసం చూడాలని ఎంతగా ఆరటపడిందో..
ఇప్పుడు ఆ ప్రోగ్రాం చూస్తూ తనను తాను అంతగా ఫీల్ అవుతుంది రమ్య.
స్క్రీన్ మీద వాళ్ళ లవ్, వాళ్ళ మాటలు, ఆ నవ్వులు, ఆ సౌండ్స్ అన్ని పిచ్చెక్కిస్తుంటే.. అప్పటివరకు దిండుతో అదుపు చేసుకున్న తన ఫీలింగ్స్ ని ఇక భరించలేక దిండు విసిరికొట్టి వాష్ రూమ్ లోకి వెళ్ళిన రమ్య షవర్ ఆన్ చేసి చల్లటి నీళ్ల కింద నిలబడింది.
నిమ్మదిగా కోపం తగ్గుతుంది, చల్లటి నీళ్లు శరీరాన్ని తడిపి కిందకు జారుతుంటే వాటితో పాటు ఒంట్లోని వేడి, కోపం, కోరిక అన్ని కూడా నెమ్మదిగా కరిగిపోతున్నాయి..
అలాగే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, బట్ ఒకటే ప్రశ్న మనసులో గుచ్చుతుంది.
ఎందుకు ప్రదీప్ తనతో సంతోషంగా ఉండడం లేదు, తనని పట్టించుకోవడం లేదు?? ఇద్దరికీ నచ్చి ఇష్టంగా పెళ్లి చేసుకుంది 6 నెలలు శరీరాన్ని పంచుకొని ఎవరి బతుకులు వాళ్ళు బ్రతకడానికా??
దీని కోసమైతే అసలు పెళ్లెందుకు?? ప్రేమ ఆశలు కోరికలు అన్ని రుచి చూపించి ఇప్పుడు నన్ను ఇలా ఏడిపించడం ఎందుకు??
మొగుడితో షేర్ చేసుకోవలసిన ఈ ఫీలింగ్స్ అన్ని నాలో నేను ఫీల్ అవుతూ నాలో నేను ఏడుస్తున్నాను.. అని అంటూనే నీళ్ల కింద తడుస్తున్న ఒంటిమీద చీర విసురుగా తీసి కుప్పగా విసిరేసింది.
నేనంటే ఇష్టం, ప్రేమ, ప్రాణం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇలా ఒంటరిగా అల్లాడేలా చేస్తున్నాడు.
కనీసం వీటి నుంచి బయటపడడానికి జాబ్ చేస్తానన్న ఒప్పుకోవడం లేదు. లక్షల లక్షల పోసి చదువుకుంది ఇలా వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఒంటరిగా ఇంట్లో కూర్చోవడానికా??
వండడం, తినడం, పడుకోవడం ఇంతకు మించి అసలు ఈ టు మంత్స్ నుంచి ఇంక ఏమీ లేదు. ఎప్పుడో తనకి గుర్తుకు వచ్చినప్పుడు కావాలంటాడు, వారానికి 10 రోజులకి ఒకసారి. అది కూడా నేను వెంటపడితేనో, లేక నేను గొడవ చేసి వెళ్లిపోతానని అలిగి కూర్చుంటేనో దగ్గరికి వస్తాడు.
మేమేమన్నా మిడిల్ ఏజ్ లో ఉన్నామా.. కోరికల గుర్రాలు మీద ఎక్కి స్వర్గం అంచులను తాకే వయసు. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం??
ఇంకో టూ ఇయర్స్ పొతే ప్రెగ్నెన్సీ, పిల్లలు. ఆ తర్వాత లైఫ్ సెటిల్మెంట్, పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ ఫ్యూచర్ కోసం పరిగెత్తడం తప్ప ఇంకా ఏ ఆలోచన రాదు.
అట్లీస్ట్ అప్పటివరకు అన్న సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే ఎలా..?? లైఫ్లో కొన్ని అయినా మాకంటూ పర్సనల్ స్వీట్ మెమరీస్ ఉండాలి కదా, అస్సలు అర్థం చేసుకోడు.. అని ప్రదీప్ మీద ఇరిటేట్ అవుతూనే బాత్ కంప్లీట్ చేసింది రమ్య.
తడి జుట్టుకి టవల్ చుట్టి, గుండెల వరకు మరొక టవల్ చుట్టుకుని బయటికి వచ్చిన రమ్య అద్దం ముందు నిలబడింది మళ్ళీ.
నున్నగా, మెత్తగా, వయస్సు పొంగుతో మెరుస్తున్న తన బాడీలో తన కళ్ళకి ఎక్కడ ఎటువంటి లోపం కనిపించడం లేదు.
ప్రాబ్లం నాలో లేదు, వాడిలో ఉంది. వాడు ఇగ్నోర్ చేస్తే నన్ను నేను తక్కువ చేసుకోవడం ఏంటి, ఇలా చెత్తగా నా మీద నేను డౌట్ పడడం ఏంటి??
వాడి ఇగ్నోరెన్స్ నన్ను డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది, పిచ్చిదాన్ని చేస్తుంది. లేదు.. ఇది ఇలా కంటిన్యూ కావడానికి అసలు ఒప్పుకోను.
ఏదైనా సరే ఈరోజు తేల్చేయాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన రమ్య డ్రెస్ చేసుకొని, వెబ్సైట్ నుంచి లాగ్ అవుట్ అయ్యి ఆ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి కిచెన్ లోకి వెళ్ళింది.
మార్నింగ్ తినవలసిన బ్రేక్ ఫాస్ట్ ఇప్పుడు పెట్టుకుని కూర్చున్న రమ్య మనసంతా ప్రదీప్ మీదే పోతుంది.
సరిగ్గా తిండి కూడా తినాలనిపించడం లేదు. ఫుల్ గా ప్రదీప్ మీద ఉన్న ఆ ప్రస్స్టేషన్ తోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మిగిలి ఉన్న ఇంటి పని అంతా కంప్లీట్ చేసుకుని బెడ్ ఎక్కి కళ్ళు మూసుకుంది.
ప్రదీప్ తో ఎలా మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చూడాలి.. అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్న రమ్య కి మళ్ళీ ఈవినింగ్ 5:30 కి వచ్చింది.
అప్పటికే రూమ్ లో పలుచగా పరుచుకున్న చీకటిని చూస్తూ లైట్స్ ఆన్ చేసి ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేసింది రమ్య.
ఉతికిన బట్టలు తీసి, బయట మొక్కలకు నీళ్లు పెట్టి, ఇంటి చుట్టూత క్లీన్ చేసుకుని, ఇంటి లోపల వర్క్ కూడా ఫినిష్ చేసుకొని వేడివేడి డిన్నర్ తో వర్క్ ఫినిష్ చేసేసరికి 8:30 అయింది.
అలసటతో కూర్చుంటూ కళ్ళు గుమ్మానికి రాసిచ్చింది.
**************************
కామెంట్స్ మస్ట్ బేబీస్…💞
వర్ణ.
Swipe left/right or tap the sides to turn pages