The Devil’s promise 😈 – 1
అందమైన సాగర తీరం
ఋషికొండ హైవే దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్ లో
దయ నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది అంత మంచిది కాదు అని నా అభిప్రాయం అన్నాడు ఒక మధ్య వయసున్న వ్యక్తి అక్కడే కింగ్ సైజ్ కుర్చీలో కూర్చుని స్మోక్ చేస్తున్న 29 ఏళ్ల దయ తో
ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో స్ట్రైట్ గా మాట్లాడితే బాగుంటుంది అని దయ ఆటిట్యూడ్ గా చెప్పడంతో
అదే నువ్వు ఆ పట్నాయక్ మనుషులతో గొడవ పెట్టుకోవడం అంత మంచి పద్ధతి కాదు నీ గురించే ఆలోచించి చెప్తున్నాను దయ వెళ్లి వాడికి సారీ చెప్పి ఇంకెప్పుడూ వాడి జోలికి గాని వాడి ఎంపైర్ జోలికి గాని వెళ్ళము అని మాటిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్నాడు అతను దయ వైపు కొంచెం భయంతో చూస్తూ
అంతే ఆ మాటకి ఒక్కసారిగా దయ కళ్ళు చింత నిప్పుల ఎర్రగా మారిపోయాయి కోపంతో చేతిలో ఉన్న వైన్ గ్లాస్ గోడకేసి కొట్టడంతో అది ముక్కలుగా పగిలి కింద పడిపోయింది
అతను భయంగా దయా వైపు చూస్తూ ఉంటే దయ ఒక్కసారిగా లేచి వాడి వైపు చూస్తూ వాడి పీక పట్టుకొని గాల్లోకి లేపాడు
నువ్వు నా తండ్రి వేనా లేదంటే నేను ఇంకెవడికైనా పుట్టానా అసలు నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నీ కొడుకుని వేరే వాడికి సారీ చెప్పమని చెప్తున్నా నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా అంటూ గర్జిస్తూ అడిగాడు దయ
అది కాదు దయ అంటూ భయంగా కష్టంగా మాటలు పలుకుతూ ఉన్న అతన్ని వైపు అసహనంగా చూస్తూ అతని పక్కకి వదిలేయడంతో నేల మీద పడి దగ్గుతూ కొడుకు వైపు చూసాడు అతను
నీకు ఇదే చెప్తున్నా నువ్వు కావాలి అంటే నాకు దూరంగా వెళ్లిపో అంతేగాని నా పనుల్లో నువ్వు వేలు పెడితే మాత్రం తండ్రివి అని కూడా చూడకుండా చంపేయాల్సి వస్తుంది అని కోపంగా చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు దయ
దయ బయటకి వచ్చేసరికి అక్కడికి వచ్చిన అతని పిఏ విశ్వ సర్ మీరు వెతికిస్తున్న ఆ అమ్మాయి డీటెయిల్స్ దొరికాయి సర్ అన్నాడు తల కిందకి వంచుకొని
అది విన్న దేవా వైపు చూస్తూ ఓకే రేపు మార్నింగ్ నేను ఆఫీస్ కి వచ్చే టైం కి తను అక్కడ ఉండాలి అన్నాడు దయ ఆర్డర్ పాస్ చేస్తూ
ఓకే సార్ అని అతను అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే దయ అక్కడి నుంచి సముద్రం వైపు చూస్తూ ఉన్నాడు
ఆ నిశ్శబ్దపు చూపుల వెనక కొన్ని వేల క్రూరమైన ఆలోచనలు ఉన్నాయి అన్న విషయం ఎవరు కనీసం పసిగట్టలేరు
చాలాసేపు అక్కడే కూర్చుని ఆ తర్వాత అక్కడి నుంచి కిందకి వెళ్లిపోయాడు
దయ తండ్రి ఇక చేసేదేం లేక అక్కడి నుంచి అతని ఇంటికి వెళ్ళిపోతే దయా మాత్రం కింద బేస్మెంట్ లో ఉన్న ఒక కిక్ బాక్సింగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడే కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు
ఆ బ్యాగ్ ని పదే పదే కొడుతూ ఉంటే అతని గ్లౌజెస్ కి మొత్తం బ్లడ్ అంటుకోవడంతో విశ్వ అంటూ ఒక్క అరుపు అరిచాడు
వెంటనే క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమైన విశ్వ చెప్పండి సార్ అన్నాడు వినయంగా
విడిపోయినట్టున్నాడు వేరే బ్యాగ్ తీసుకొనిరా తన మనుషులని కొంతమందిని పిలిచి ఆ బ్యాగ్ కిందకి దించమని చెప్పడంతో
వాళ్లు బ్యాగ్ కిందకి దించారు
అందులో ఒక వ్యక్తి మొహం మొత్తం పచ్చడి అయిపోయి గుర్తుపట్టలేని విధంగా భయంకరంగా ఉంటే వాళ్లు కూడా కొన్ని నిమిషాలు భయపడి తర్వాత వాళ్లకి వాళ్లే ధైర్యం చెప్పుకొని ఆ బాడీని అక్కడి నుంచి తీసేసి ఆ బ్యాగ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు
@@@@@@@@@@@
ఒసేయ్ ఎక్కడ చచ్చావే ఇప్పటివరకు నువ్వు పడుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అనుకుంటున్నావ్? అంటూ కోపంగారుస్తూ వేడివేడిగా మరిగే నీళ్లు తీసుకొచ్చి అక్కడే నేల మీద పడుకున్నా ఒక అమ్మాయి వంటిమీద ఒంపేసింది ఒక ఆవిడ
అమ్మ అంటూ గట్టిగా అరిస్తూ లేచింది 23 సంవత్సరాల అమ్మాయి
వేడి నీళ్లు పోయడం వల్ల ఒళ్లంతా మంటగా అనిపిస్తూ ఉంటే ఆవిడ ఆ అమ్మాయి వైపు చూస్తూ ఏం మా మహారాణి ఇంకా తెల్లవారలేదా పో ముందు పోయి టిఫిన్ లంచ్ ప్రిపేర్ చెయ్ లేదంటే ఏం చేస్తానో నాకు తెలియదు పో వచ్చిందండి పెద్ద మహారాణి తిని పడుకోవడానికి అంటూ కాలితో ఆ అమ్మాయి ని తన్నేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒక 50 ఏళ్ల ముసలావిడ
అప్పటికి వేడి నీళ్లు తన చేతి మీద పడటంతో ఏడుస్తూ గబగబా లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి ఐస్ వాటర్ తీసుకొని ముందుగా చల్లని నీళ్లు ఆ ప్రదేశం దగ్గర పెట్టుకొని కొంచెం మంట తగ్గిన తర్వాత గబగబా స్నానం చేసేసి వచ్చి టిఫిన్ చేస్తూ ఉంది
ఇంతలో అక్కడికి వచ్చాడు 40 ఏళ్ల వ్యక్తి
ఆ అమ్మాయి వంట చేస్తూ ఉంటే ఆ అమ్మాయిని వెనకనుంచి కొనుక్కు తినేలా చూస్తూ వెనక్కి తిరిగి చుట్టూ చూశాడు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఇక అదే అదనుగా భావించినవాడు లోపలికి వెళ్లి ఆ అమ్మాయిని వెనకనుంచి హగ్ చేసుకుని ఈరోజు ఎంత బాగున్నావో తెలుసా? నిన్ను ఇలా చూస్తుంటే ఇప్పుడే నీ ప్రతి అందాన్ని నా సొంతం చేసుకొని నిన్ను నలిపేయాలి అనిపిస్తుంది అంటూ ఇంకా చాలా పచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు
వదలండి నన్ను వదిలేయండి అంటూ అతని చేతి నుంచి వదిలించుకోవడానికి గింజుకుంటూ ఉంటే వాడు అది నచ్చక ఆ అమ్మాయి నడుముని నలిపేస్తూ ఏంటే నేను నీకు కాబోయే మొగుడిని అర్థమవుతుందా నేను నిన్ను ముట్టుకుంటే వచ్చి నా కౌగిలిలో వాలిపోవాలి గాని ఇలా దగ్గరికి ముడుచుకుపోయి ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఏంటే అర్థం అడిగాడు వాడు కోపంగా
ప్లీజ్ అండి నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అంటూ ఏడుస్తూ చేతులు జోడించి వేడుకుంటూ ఉంటే వాడు ఆ అమ్మాయి ఏడుపు కనీసం చూడకుండా అతనికి అభిముఖంగా తిరిగిన ఆ అమ్మాయి పర్వాల వైపు చూస్తూ అబ్బా ఏం పెంచావే నాకోసమే ఇంత పెంచావా ఒక్కసారి గదిలోకి రావచ్చు కదా మా అక్క తో మాట్లాడి నీకు ఈ పనులేమీ లేకుండా చేస్తాను నిన్ను మహారాణిలా నా పక్కనే పెట్టుకుంటా అంటూ మాట్లాడుతూ ఉంటే అతని మాటలకి అసహ్యం కలుగుతూ ఉంటే భయంగా అతని వైపు చూస్తూ ఉంది
ఇంతలో వాళ్ళ అక్క అక్కడికి రావడం గమనించిన వాడు ఇప్పుడు కాదు రాత్రికి చెప్తా నీ పని అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ అమ్మాయి అక్కడే నేలకి ఒరిగిపోయి ఏడుస్తూ కూర్చుంది
——–continues………….
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
Swipe left/right or tap the sides to turn pages