సాయంత్రం స్కూల్ అయిపోయాక తన కొడుకు శ్రేయస్‌తో కలిసి నడుచుకుంటూ వస్తోంది నిత్య……….. !! దారిలో శ్రేయస్ కి ఇష్టమైన ఐస్‌క్రీమ్ కనిపించగానే అది వాడికి కొనిపెట్టి మెల్లగా నడుస్తూ వెళ్తున్నారు…….. !! నిత్య పక్కనే నడుస్తున్న రక్ష నిత్య వైపు చూస్తూ అదేంటి నిత్య మేడమ్ చెప్పగానే మంగళూరుకి షిఫ్ట్ అవ్వడానికి వెంటనే ఒప్పేసుకున్నావు……..?? To be honest ఈ ఊరిని వదిలి వెళ్లాలంటే నీకు ఏమాత్రం బాధ గా అనిపించడం లేదా……..?? ఫోర్ ఇయర్స్ గా ఈ సిటీ నీకు షెల్టర్ ఇచ్చింది & నీకు ఇక్కడ ఎన్నో కొన్ని మెమోరీస్ ఉంటాయి కదా అలా ఎలా అన్నిటినీ వదిలేసి వెళ్ళాలి అనుకున్నావ్……….. ??