ప్రేమ దూరమైన తర్వాత-1
తెగిపోయిన బంధం…
విరిగిపోయిన నమ్మకం…
దూరమైన రెండు హృదయాలు…!!
కాలం మళ్లీ వారిని ఒకే దారిలో నిలబెడితే…..??
గాయపడ్డ మనసులు మళ్లీ కలుస్తాయా……??
క్షమాపణలు ప్రేమగా మారతాయా……..??
విడిపోయిన బంధం మళ్లీ బలమైన అనుబంధంగా మారుతుందా…….??
తెగిపోయిన బంధానికి మళ్లీ ముడి పడుతుందా……??
అదే ప్రేమ దూరమైన తర్వాత కథ…….!!
ముంబై!!
రాత్రి పదకొండు గంటలు.!!
ముంబై సిటీ లోని ఒక ప్రైమ్ ఏరియాలో ఉన్న పెద్ద మాన్షన్ కాలింగ్ బెల్ ఒక్కసారిగా మోగింది…….. !! కాసేపటికి డోర్ ఓపెన్ చేసింది ఆ ఇంటి పెద్ద శకుంతలమ్మ……….. !! ఎదురుగా హెవీగా డ్రింక్ చేసి కనీసం సరిగ్గా నిలబడలేక తూలుతున్న తన ముప్పై రెండేళ్ల మనవడిని చూసి ఆమె బాధగా అతని వైపు చూస్తూ ఉంటుంది…….. !! అతను లోపలికి వచ్చి వాల్ సపోర్ట్ తీసుకుని ఎదురుగా కనిపిస్తున్న తన అమ్మమ్మ వైపు చూస్తూ……… !! అమ్మమ్మా ఏంటిది నువ్వు ఇంకా నిద్రపోలేదా ఇట్స్ టూ లేట్ వెళ్లి పడుకో……….!!అని మాటలు తడబడుతూనే చెప్పి స్టెప్స్ ఎక్కబోయాడు………….. !!
ఈరోజైనా డిన్నర్ చేసి పడుకో నాన్న డెయిలీ ఇలా తినకుండా తాగుతూ మత్తులో నిద్రపోతే నీ హెల్త్ ఏమైపోవాలి ……..?? అని శకుంతలమ్మ నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ అడుగుతుంది……… !!
అది విన్న అతని పెదవులపై విరక్తితో కూడా నవ్వు………. !! హెల్త్… హ్మ్మ్ ఎవరి హెల్త్ కోసం తినాలి
శకు మై లైఫ్ ఈజ్ ఆల్రెడీ హెల్…….. !! ఇలా తినకుండా ఏదో ఒకరోజు చచ్చిపోవాలి అదే నా కోరిక దట్ విల్ బి ద హ్యాపీయెస్ట్ డే ఫర్ మీ………!! అని చెప్పి నెమ్మదిగా పై ఫ్లోర్ లో ఉన్న తన రూమ్ వైపు వెళ్లిపోయాడు అతను……….. !! అతను చెప్పిన మాటలు విన్న అతని పేరెంట్స్ తమ రూమ్ డోర్ చాటునే నిలబడి మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నారు……… !! వీడు ఇంకెప్పుడు మారుతాడు అని ఇద్దరూ బాధగా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు……… !!
అతడే అర్జున్ భట్టాచార్య……!! ఆ ఇంటి ఏకైక వారసుడు భట్టాచార్య ఇండస్ట్రీస్ కి వన్ అండ్ ఓన్లీ ఛైర్మన్ అండ్ సీఈఓ……… !! వర్క్ విషయంలో హి ఈజ్ ఎ పర్ఫెక్ట్ డిసిప్లిన్డ్ పర్సన్ & అన్ కాంప్రమైజింగ్ ఆటిట్యూడ్……… !! చాలా అర్రోగాంట్ ఆఫీస్ లో ఎవరైనా చిన్న మిస్టేక్ చేసినా అసలు సహించడు. …… !! డే మొత్తం తన కంపెనీ బిజినెస్ డీల్స్, మీటింగ్స్‌తోనే గడిపేస్తాడు……… !! మిగిలిన టైమ్ మాత్రం హెవీగా ఆల్కహాల్ మత్తులోనే గడిచిపోతుంది……. !! అయితే డ్రింకింగ్ తప్పా అతనికి వేరే ఏ అలవాట్లు లేవు పర్టికులర్‌గా క్యారెక్టర్ విషయం లో అతను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు……… !! ఇంట్లో తన అమ్మమ్మ శకుంతలమ్మ, చెల్లెలు సృష్టి, ఆమె హస్బెండ్ సంకేత్, వాళ్ల అబ్బాయి తో మాత్రమే మాట్లాడతాడు అర్జున్……. !! తన పేరెంట్స్ కేశవ్ భట్టాచార్య, విమల, తన అత్తా మామ మానస, రాజేష్ వారి కూతురు అనుపమ, తన అక్క సుకన్య……….. !! ఇంట్లో ఇంతమంది ఉన్నా వారితో అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడడు వాళ్లు పలకరించినా కూడా కేర్ చేయడు……… !!
మరుసటి రోజు…..
ఉదయం ఐదు గంటలకే నిద్రలేచిన అర్జున్ నేరుగా తన రూమ్‌లోనే ఉన్న పర్సనల్ జిమ్‌కి వెళ్లాడు…….. !! దాదాపు గంటన్నర పాటు బాడీని ఎక్స్‌ట్రీమ్ లెవల్‌లో స్ట్రెయిన్ చేస్తూ జిమ్ ఫినిష్ చేశాడు…….. !! స్వేదం చుక్కలు శరీరాన్ని తాకుతుండగా స్నానం ఫినిష్ చేసి సూట్ లో రెడీ అయ్యి ఆఫీస్‌కు స్టార్ట్ అయ్యాడు……… !!
ఆఫీస్ కి బయలుదేరే ముందు ఒక్కసారి తన రూమ్ చుట్టూ చూస్తాడు…….. !! రూమ్ రైట్ సైడ్ కి ఉన్న పెద్ద గ్లాస్ ఫ్రేమ్ దగ్గరకు వెళ్ళి ఆ ఫోటో వైపు చూస్తాడు అందులో తన భార్యతో కలిసి నవ్వుతూ దిగిన పిక్చర్ ఉంది………. !! ఆ ఫోటో ను చూసి ప్రేమగా వేళ్లతో తాకుతూ………… !! నిత్య ఎక్కడున్నావు నువ్వు……….?? ప్లీజ్ కమ్ బ్యాక్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ……… !! నిన్ను వెతుకుతూ ఈ 4 ఇయర్స్ గా ఎంత తిరిగానో & ఎంత వెతికానో తెలుసా……… ?? ఇంకెన్ని ఇయర్స్ నాకు ఈ శిక్ష వేస్తావు నిత్య……..?? నువ్వు లేని ఈ లైఫ్‌ని లీడ్ చేయడం నా వల్ల కావడం లేదు………. !! ఎప్పుడో ఒకరోజు నా కోసం తిరిగి వస్తావన్న ఒక్క హోప్‌తోనే ఇప్పటికీ ఈ నరకాన్ని భరిస్తున్నాను………. !! నువ్వు ఒక్కసారి నా ముందుకు వచ్చి అర్జున్, నిన్ను క్షమించేశాను అని ఒకే ఒక్క మాట చెప్పు……… !! ఆ తర్వాత నా లైఫ్ ఎండ్ అయిపోయినా నాకు ఎలాంటి రిగ్రెట్స్ ఉండవు అని బాధగా కళ్లు మూసుకున్నాడు……… !! తన బ్లేజర్ విప్పి షర్ట్ పై రెండు బటన్లు మెల్లగా ఓపెన్ చేసాడు…….. !! అతని గుండె మీద ట్యాటూ ను చూసి నిత్య అనే టాటూ ను నిమురుతూ బాధగా కళ్లు మూసుకుంటాడు……… !! అతని కళ్ల అంచుల నుంచి రెండు వేడి కన్నీటి చుక్కలు ఆ ట్యాటూ మీద పడ్డాయి…….. !! ఆ తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకుని కిందకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు………. !!! తన బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ ముందుకు లాక్కుంటుండగా అర్జున్ అత్తయ్య మానస అక్కడికి వచ్చి చిరునవ్వుతో ఎదురుగా కూర్చుని …….. !! అర్జున్, ఈరోజు నీకు ఇష్టమైన అని ఏదో అనబోయింది……. !!
అంతే…??అర్జున్ కళ్ళు బగ బగ మండే అగ్నిపర్వతంలా మారిపోయి టేబుల్ మీద ఉన్న గ్లాస్, బౌల్స్ అన్నింటినీ ఒక్కసారిగా కిందకేసి కొట్టాడు ………. !! ఆ సౌండ్‌కి ఇంట్లో వాళ్లంతా డైనింగ్ ఏరియా కి వచ్చి అర్జున్ కోపాన్ని చూసి షాక్ అయ్యారు ………. !! బట్ అర్జున్ ఎవరి వైపు చూడకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక అగ్రెసివ్ లుక్ ఇచ్చి అక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు……….. !!
అది శివమొగ్గలోని ఒక ప్రశాంతమైన చిన్న టౌన్……… !!
ఉదయం ఆరు గంటలకు ఫోన్ అలారం సౌండ్‌తో మేల్కొన్న ఆమె…… !! తన పక్కనే గాఢ నిద్రలో ఉన్న మూడున్నరేళ్ల కొడుకుని చూసి తన మొహం లో చిరునవ్వు మెరిసింది…….. !! తన కొడుకు క్యూట్ బుగ్గలను మెల్లగా నిమిరి నుదుటిపై, బొద్దుగా ఉన్న చెంపలపై ప్రేమగా ముద్దులు కురిపించింది…….. !!
తర్వాత చలి గాలి తగలకుండా బ్లాంకెట్ సరిచేసి నెమ్మదిగా గది బయటకు నడిచింది……. !! ఇంటి ముందున్న ముంగిటిని నీళ్లతో శుభ్రం చేసి చుక్కల ముగ్గుతో అందమైన డిజైన్ వేసింది……… !! ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి వంట పనులు స్టార్ట్ చేసింది……… !!
టిఫిన్ కోసం ఇడ్లీ కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి , చట్నీ ప్రిపేర్ చేసి బాత్ కి వెళ్లి ……… !! ఫ్రెష్ అప్ అయి కాటన్ శారీలో రెడీ అయి వచ్చి పూజా గదిలో దేవుడి ముందు ప్రమిద వెలిగించి చేతులు జోడించింది……… !! స్వామీ నా కొడుకు కు హెల్తీ లైఫ్ & దీర్ఘాయుష్షు ఇవ్వు……….. !! నా లైఫ్ స్పాన్ కూడా వాడికే ఇచ్చేయ్ స్వామి నా కొడుకు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి………. !! నేను ఇంకా బ్రతకడానికి ఉన్న ఒకే ఒక్క రీజన్ నా కొడుకు అని తన కొడుకు గురించి కోరుకుంటూ………. !! తర్వాత తన కొడుకుని నిద్రలేపడానికి బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది……… !!
అప్పూ… మై డియర్ అప్పూ… లేవమ్మా… నా బంగారు తండ్రివి కదా లే నాన్నా లేట్ అవుతుంది ఇంకా నువ్వు స్కూల్‌కి రెడీ అవ్వాలి కదా అంటూ ………. !! ముద్దుగా పడుకున్న తన కొడుకుని నిద్ర లేపుతుంది ఆమె……….. !!
నెమ్మదిగా కళ్లు తెరిచిన తన కొడుకు చేతులు చాస్తూ ………. ;! అబ్బా ఏంటి మమ్మీ ఎప్పుడూ ఎర్లీగా లేవమంటావు నేను ఇంకా కాసేపు పడుకుంటూ ప్లీజ్ మమ్మీ అంటూ కళ్లు మూసుకుంటూ ముద్దుగా చెప్తాడు………… !! ఆమె తన కొడుకు మాటలకు నవ్వుతూ అలానా సరే అయితే ……… !! ఈరోజు నాతో పాటు బయటకు ఎవరొస్తారో వాళ్లకు పెద్ద చాక్లెట్ అండ్ ఐస్‌క్రీమ్ కొనిపెడదామనుకున్నా పర్లేదులే నువ్వు ఇంట్లోనే ఉండు నేను ఒక్కదాన్నే వెళ్లొస్తాను అంది………. !! అంతే
పడుకున్న బుడ్డోడు సడెన్ గా లేచి కూర్చుని నో నో మమ్మీ! ఇక్కడ చూడు నేను ఇప్పుడు బిగ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ అయ్యాను కదా……..!! నేను త్వరత్వరగా రెడీ అయిపోతాను అంటూ ఆమె మెడను రెండు చేతులతో చుట్టేసి చెంపపై ముద్దు పెట్టాడు……… !!
ఏయ్ దొంగా నువ్వు ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు & ఫేస్ కూడా వాష్ చేసుకోలేదు……… !! అప్పుడే మమ్మీకి ముద్దు పెట్టేస్తున్నావా…….?? అందుకే నువ్వు ఇంకా గుడ్ బాయ్ కాదు……… !! పైగా ఇంకా ‘ళ’, ‘ఱ’, ‘డ’ అక్షరాలు కూడా పర్ఫెక్ట్‌గా పలకలేవు…….. !! సో నువ్వు బిగ్ బాయ్ కాదు అని నవ్వుతూ అతనికి బ్రష్ చేయించి, ముఖం కడిగి, వేడిగా ఉన్న హార్లిక్స్ కప్పు చేతికిచ్చింది…….. !!
ఆ తర్వాత నెయ్యి, పంచదార కలిపిన వేడివేడి ఇడ్లీలను తన చేతులతో తినిపించింది……… !! తర్వాత బుడ్డోడికి స్నానం చేయించి, నీట్‌గా స్కూల్ యూనిఫామ్ వేసి రెడీ చేసింది………. !! తానూ కూడా బ్రేక్ ఫాస్ట్ చేశాక బ్యాగ్ సర్దుకుని కొడుకుని తీసుకుని స్కూల్‌కు బయలుదేరింది ఆమె……… !!
దారిలో ఆమెకు వాళ్ల కొలీగ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ రక్ష కూడా వాళ్లతో జాయిన్ అయింది…….. !! చిన్నోడిని చూడగానే రక్ష ఎగ్జైట్ అవుతూ హాయ్ మై లిటిల్ అప్పూ అంటూ వాడి బుగ్గను గిల్లి ముద్దు పెట్టడానికి ముందుకు వంగింది……… !! వెంటనే వాడు సీరియస్‌గా మొహం పెట్టుకొంటూ………… !! నేను మమ్మీకి మాత్రమే అప్పు మీరు నన్ను శ్రేయస్ అని పిలవాలి అండర్ స్టాండ్ …….?? అన్నాడు కోపంగా………. !! వాడి ఆటిట్యూడ్ అండ్ ముద్దు ముద్దు మాటలు విని రక్ష గట్టిగా నవ్వేసింది. ……. !! నిత్య నీ కొడుకు మాటలు ఎంత క్యూట్‌గా ఉంటాయో తెలుసా………!! వాడి ప్రాపర్ ఆటిట్యూడ్ కూడా చాలా బాగుంటుంది……… !! చూడడానికి కూడా సేమ్ కటౌట్ఎంత తెల్లగా, గుండ్రంగా, బబ్లీగా ఉన్నాడో బుజ్జిగాడు…….. !! నిత్య వెంటనే కంగారుగా రక్ష వైపు చూసి ఏయ్ నా కొడుకుపై దిష్టి పెట్టకు ముందు దిష్టి తీసిన తర్వాతే టచ్ చేయ్ అంటూ శ్రేయస్‌ను ఎత్తుకుని మూడుసార్లు దిష్టి తీసి దించుతుంది……… !!
కొద్దిసేపు ముందుకు నడిచాక నిత్య మెల్లగా రక్షూ వాట్ ఎబౌట్ యువర్ పర్సనల్ లైఫ్……..?? నీ కాబోయే హజ్బెండ్ ఏమంటున్నాడు? వెన్ ఈజ్ ద వెడ్డింగ్…… ??
అంతే రక్ష ముఖంలో ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమైంది కళ్లలో నీళ్లు తిరిగాయి………. !! నో వెడ్డింగ్ నిత్యా నథింగ్! వాడు నా ఎమోషన్స్‌తో ఆడుకున్నాడు……….!! హి ఈజ్ ఎ చీటర్ నాతో పాటు ఇంకా ఎంతమంది గర్ల్స్‌తో ఫ్లర్ట్ చేస్తున్నాడో తెలియదు………. !! నిన్న వాడి ఫోన్ చెక్ చేసిన తర్వాతే నాకు తెలిసింది ఏంటిది అని అడిగితే అవును అన్నీ నిజమే……….. !! నువ్వు నాకేం అవసరం లేదు నేను ఇలానే ఉంటా ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పో అని సింపుల్‌గా చెప్పి వెళ్లిపోయాడు అంటూ ఏడ్చేసింది……… !! అది విన్న నిత్య రక్ష భుజం తట్టి ఓదారుస్తూ………….. !! రిలాక్స్ రక్ష పోతే పోయాడు నీ లైఫ్ పాడవ్వకుండా ముందే నిజం తెలిసింది దట్స్ ఎ గుడ్ థింగ్……….. !! పెళ్లయ్యాక తెలిస్తే ఆ పెయిన్ ఇంకా ఘోరంగా ఉండేది……….. !! పేరెంట్స్ చూసిన మంచి అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉండు అంది……… !!
రక్ష కాసేపు సైలెంట్ గా ఉండి నిత్య వైపు సీరియస్‌గా చూస్తూ……… !! నిత్య ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ థింగ్ అడిగాక నిజం చెప్పాలి…….. !!
అడుగు రక్ష…… !!
నీకు లవ్ అన్నా, మెన్ అన్నా ఎందుకంత కోపం ………?? హావ్ యు ఎవర్ బీన్ ఇన్ లవ్ విత్ ఎనీవన్ ……..??ఆ క్వశ్చన్ వినగానే నిత్య అడుగులు ఒక్కసారిగా తడబడి ఆగిపోయాయి………. !! గుండెను ఏదో గుచ్చినట్టు
కళ్లల్లో నీళ్లు తిరిగాయి………. !! పాత జ్ఞాపకాల సుడిగాలి మనసును చుట్టుముట్టింది………… !! అవును… ఐ లవ్డ్ సంవన్ ఎక్స్‌ట్రీమ్‌లీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను……….. !! అతని మాటలను బ్లైండ్‌గా నమ్మి నా ఎంటైర్ ఫ్యామిలీని ఎదిరించి అతడే నా ప్రపంచం అని వెళ్లాను………. !! బట్ ఫైనల్ గా నా లైఫ్‌ని నా చేతులతోనే నాశనం చేసుకున్నాను అంది వణుకుతున్న గొంతుతో………. !! ఆమె కళ్లలో మెరిసిన ఆ డీప్ పెయిన్ చూసి రక్ష గుండె బరువెక్కింది………. !! ఐ యామ్ సో సారీ నిత్యా ఐ డిడెంట్ మీన్ టూ హర్ట్ యు……… !! నీ పాత గాయాన్ని మళ్లీ గుర్తు చేశాను అని గిల్టీగా అంది………. !! ఇట్స్ ఓకే రక్ష ఇవన్నీ నా లైఫ్‌లో పార్ట్ అయిపోయాయి……… !! పద వెళ్దాం టైమ్ అవుతోంది ఇంకో వారం రోజులు మాత్రమే కదా………. !! పిల్లలకు రిజల్ట్స్ ఇచ్చేస్తే నెక్స్ట్ హాలిడేస్ వస్తాయి కాస్త పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు అని ఇద్దరూ స్కూల్ వైపు నడిచారు……….. !!
స్కూల్‌కి వెళ్లగానే తన కొడుకు శ్రేయస్‌ను మిగతా పిల్లలతో ఆడుకోవడానికి గ్రౌండ్‌లో వదిలేసి ……… !! ఆఫీస్ రూమ్‌లో పిల్లల ఎగ్జామ్ రిజల్ట్స్, మార్కుల షీట్లు ప్రిపేర్ కరెక్షన్ చేసే పనిలో నిత్య బిజీ అయిపోయింది……… !!
అప్పుడే అక్కడికి వచ్చిన అటెండర్ నిత్య మేడమ్ హెడ్ మేడమ్ మిమ్మల్ని అర్జెంట్‌గా ఆఫీస్ రూమ్‌కి రమ్మంటున్నారు………. !! అలాగే మీ బాబుని కూడా వెంట తీసుకుని రమ్మన్నారు…….. !! అది విన్న నిత్య ఓకే… వస్తున్నాను అని శ్రేయస్‌ను ఎత్తుకుని హెడ్ మేడమ్ క్యాబిన్‌కి వెళ్తుంది…….. !!
మేడమ్ రమ్మన్నారట…….. ??
యస్ నిత్యా ప్లీజ్ కమిన్ అంటూ ……… !! హెడ్ మేడమ్ సీట్లోంచి స్వయంగా లేచి వచ్చి శ్రేయస్‌ను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు……… !! శ్రేయస్ చేతిలో పెద్ద చాక్లెట్ పెట్టి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ…….. !!
ఎలా ఉన్నావమ్మా నిత్యా? నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద ఊరికి వెళ్లి వారం రోజులు అయిపోయింది………. !! అందుకే రాగానే నిన్ను చూడాలని పంపించాను………. !! మీ ఇద్దరినీ చూడకపోతే నాకు డే గడవదు నిత్య అని ఆప్యాయంగా అన్నారు……… !! ఆ మాటకు నిత్య నవ్వుతూ……….. !! నాకు తెలుసు మ్యామ్ మా ఇద్దరిపైనా మీరు చూపిస్తున్న కేర్ అండ్ అఫెక్షన్ కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం………. !! మేమిద్దరం బాగానే ఉన్నాం ఇంకో వారం రోజుల్లో సెషన్ క్లోజ్ అయి హాలిడేస్ వస్తాయి కదా………. !!! అప్పుడు మీరు డెఫినెట్‌గా మా ఇంట్లోనే కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి అంది……… !!
ష్యూర్ అని చిరునవ్వుతో తల ఊపి…….. !! నిత్య నేను నిన్నో ఇంపార్టెంట్ హెల్ప్ అడుగుదామని పిలిచాను…….. !! విల్ యు డూ దట్ ఫర్ మీ ……. ??
ఖచ్చితంగా మేడమ్… ఏంటో చెప్పండి…….. !!
నువ్వు మంగళూరుకి వెళ్లగలవా……..?? అక్కడ నా సిస్టర్ ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా వర్క్ చేస్తోంది………. !! దాన్ని రన్ చేసేది వేరే డోనర్స్ అక్కడ ప్రైమరీ క్లాసెస్ టీచ్ చేయడానికి ఎక్స్‌పీరియన్స్ ఉన్న లాంగ్వేజ్ టీచర్స్ కావాలట…….. !! నీకు ఫస్ట్ క్లాస్ నుండి సెవెంత్ వరకు పిల్లలను కంట్రోల్ చేస్తూ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే మంచి ట్రాక్ రికార్డ్ ఉంది……… !! అందుకే నిన్ను అక్కడికి డెలిగేషన్‌పై పంపించాలని అనుకుంటున్నాను………. !! సాలరీ అండ్ అకామడేషన్ ప్యాకేజ్ చాలా బాగుంటుంది………. !! నీ గురించి ఆల్రెడీ నా సిస్టర్‌కి చెప్పాను…….. !! నిత్య కాసేపు ఆలోచించి
సరే మ్యామ్ ఐ యామ్ రెడీ టూ గో……… !! ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది……… !! నీ భర్త ఆర్మీలో ఉన్నాడంటావు ఎప్పుడూ రాడేంటి ………. ?? అని చుట్టుపక్కల వాళ్లు పదే పదే అడుగుతూనే ఉన్నారు……….. !! సేమ్ ఆన్సర్ రిపీట్ చేసి నాకు కూడా విసుగొచ్చింది. ………. !! వేరే కొత్త సిటీకి షిఫ్ట్ అయితే అట్లీస్ట్ ఇంకొన్ని ఇయర్స్ అయినా ఈ సొసైటీ క్వశ్చన్స్ నుండి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అంటూ ఒక చిన్న వేదనతో నిండిన నవ్వు నవ్వింది………. !!
డోంట్ వర్రీ నిత్య ఎవ్రీథింగ్ విల్ బి ఆల్‌రైట్…….. !! ఇంకో విషయం నీ ఫ్రెండ్ రక్షని కూడా అడుగు……… !! ఆ అమ్మాయి కూడా ఓకే అంటే మీ ఇద్దరూ కలిసి వెళ్లొచ్చు………… !! నాకు కూడా ధైర్యంగా ఉంటుంది………… !!
షూర్ మేడమ్ అడిగి కన్ఫర్మ్ చేస్తాను అంటూ బయటకు వచ్చింది……….. !! శ్రేయస్ మాత్రం చాక్లెట్ ఎంజాయ్ చేయడంలో బిజీగా ఉన్నాడు……… !! బయటికి వచ్చిన నిత్య, రక్ష ను మంగళూరు గురించి అడుగుతుంది………. !!
వావ్… నిజమా? దట్స్ గ్రేట్! ఐ యామ్ కంప్లీట్లీ ఓకే………. !! ఇంట్లో ఉండేది నేనూ, అమ్మ మాత్రమే కదా వి ఆర్ ఆన్ రెంట్ సో ఎలాంటి ఇష్యూస్ లేవు వి ఆర్ లీవింగ్ అంది రక్ష ఎగ్జైట్‌మెంట్‌తో………. !! వెంటనే నిత్య రక్ష ను హత్తుకుని……… !! థ్యాంక్యూ సో మచ్ రక్షూ అక్కడ నేను శ్రేయస్ తో ఒక్కదాన్నే సర్వైవ్ అవ్వగలనా అని కొంచెం నెర్వస్‌గా అనిపించింది …….. !!
రక్ష చిన్నగా నవ్వుతూ నిత్య నువ్వెందుకు అంతగా భయపడతావు……….?? వేర్ ఎవర్ యు గో ఐ విల్ ఫాలో యు! నీ వెంట ఉండే విక్రమార్కుడి బేతాళాన్ని నేను మర్చిపోకు అంటూ కన్ను కొట్టి తన క్లాస్ కి టైమ్ అవ్వడం తో ఒకే క్లాస్ అయ్యాక కలుస్తాను అంటూ వెళ్ళిపోతుంది రక్ష……… !! రక్ష వెళ్లిపోయిన తర్వాత నిత్య ఒక్కతే బెంచ్ మీద కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది………. !! ఎక్కడి నుంచి ఎక్కడికి నా లైఫ్ ట్రావెల్ అవుతోంది…………??
కొత్త ఊరు… కొత్త మనుషులు… కొత్త అట్మాస్ఫియర్…
నా ఫ్యూచర్ లో ఇంకెన్ని విచిత్రమైన చేంజెస్ తీసుకొస్తాయో… చూడాలి…….అని తనలో తానే అనుకుంది…….. !!
ఇది మన హీరోయిన్ నిత్య కథ తను ఒక ప్రైమరీ స్కూల్ టీచర్…….. !! తన ప్రపంచం మొత్తం ఒక్కటే తన కొడుకు శ్రేయస్ ………… !! ప్రేమలో నమ్మించి మోసపోయాను అని చెప్పే నిత్య జీవితంలో దాగి ఉన్న నిజమైన సత్యమే ఈ ప్రేమ దూరం అయిన తర్వాత 💔 ………… !!
అదే రోజు సాయంత్రం కార్పొరేట్ హెడ్ ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చిన అర్జున్ దగ్గరకు వచ్చింది శకుంతల……… !!
అర్జున్ ప్రతి సంవత్సరం మనం కర్ణాటకలోని మన కులదేవత టెంపుల్‌కి వెళ్తాం కదా……… !! నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్‌లో ముహూర్తం ఉంది, వెళ్లాలి…….. !!
మీరందరూ వెళ్లి రండి అమ్మమ్మ……… !! నాకెందుకు ఇవన్నీ చెబుతున్నారు? ఐ హావ్ లకేషన్స్ ఆఫ్ వర్క్ అన్నాడు అర్జున్ విసుగ్గా………. !! ఈసారి నువ్వు కూడా రావలసిందే అర్జున్ అని అంటున్న ఆమె గొంతు లో తెలియని పెయిన్……… !! అది విన్న అర్జున్ ముఖం ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోయి కళ్లు ఎర్రబడ్డాయి………. !!
వాట్…? నేను రావాలా? నో వే! అసలు ఛాన్సే లేదు…….. !! ఇక ఈ జన్మలో కర్ణాటక బోర్డర్ వైపు కూడా నేను అడుగు పెట్టను మీరు నన్ను ఫోర్స్ చేయకండి అంటూ సీరియస్ గా చెప్తాడు…….. !! అలా భీష్మించుకు కూర్చోకు అర్జున్ అని శకుంతలమ్మ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ…….. !! ఈ ఒక్కసారి నా మాట విను నాన్న మంగళూరుకి వెళ్లి కులదేవత పూజ చేయించుకుని వద్దాం. ………… !! అక్కడ మన ఇండస్ట్రీస్ బ్రాంచెస్ అండ్ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా……… !! అక్కడ చాలా ఇష్యూస్ పెండింగ్‌లో ఉన్నాయి నువ్వు పర్సనల్‌గా వెళ్లి హ్యాండిల్ చేస్తే తప్ప అవి సాల్వ్ కావు……… !! ఇక్కడి ముంబై వర్క్స్ చూసుకోవడానికి బోర్డ్ మెంబర్స్ ఉన్నారు కదా అర్జున్………. !!
అపుడే అక్కడికి వచ్చిన అర్జున్ సిస్టర్ సృష్టి…….. !!
అవునన్నయ్యా అమ్మమ్మ చెప్పేది నిజమే లెట్స్ గో………… !! నాకు కూడా చాలా రోజులుగా మంగళూరు ట్రిప్ వెళ్లాలని ఉంది………. !! అక్కడి బీచెస్, అట్మాస్ఫియర్ చూడాలనిపిస్తోంది………. !! మనం అక్కడికి వెళ్లి దాదాపు ఫోర్ ఇయర్స్ అయిపోయింది అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది…….. !! ఇద్దరూ అంతగా అడగడంతో పర్సనల్ ఎమోషన్స్ ని పక్కన పెట్టి మనసులో ఎంత ఇష్టం లేకపోయినా చివరకు అర్జున్ ఒప్పుకోక తప్పలేదు…….. !!
ఫైన్… !! నెక్స్ట్ వన్ మంత్ నాకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్ ఉన్నాయి……… !! అవి కంప్లీట్ అయ్యాకే షెడ్యూల్ ప్లాన్ చేయండి ఇట్స్ మై ఫైనల్ వర్డ్ అని సీరియస్ గా చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతాడు…… !!
అర్జున్ రావడానికి ఒప్పుకోవడమే చాలా పెద్ద విషయంగా భావించిన శకుంతలమ్మ, సృష్టి ఇద్దరూ ఎంతో హ్యాపీగా ఓకే అర్జున్ అన్నారు………. !!
అర్జున్ , నిత్య 4 ఇయర్స్ క్రితం ఒక దారుణమైన మలుపులో అతని జీవితం నుండి దూరమైపోయింది………… !!
మరోవైపు నిత్య తన ఐడెంటిటీ ను దాచుకుంటూ తన కొడుకు శ్రేయస్‌తో ఒంటరిగా ఒక టీచర్‌గా కష్టపడుతోంది………… !!
గతం తవ్విన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి…!!
ఇరువైపులా కన్నీళ్లు ఇంకా ఇంకిపోలేదు…..!!
విధి ఆడే విచిత్రమైన నాటకంలో వీరిద్దరి దారులు మళ్లీ మంగళూరులోనే కలవబోతున్నాయా…….. ??
Swipe left/right or tap the sides to turn pages