New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హీరో బావ-1

హీరో బావ-1

మై డియర్ సేనోరిటా.
యు ఆర్ లూకింగ్ టు సెక్సీ బేబ్స్..
కెన్ వి హావ్ గ్రేట్ టుడే?
అని అడిగాడు షర్ట్ లెస్ గా ఉన్న అమ్మాయి హస్బెండ్.

అఫ్కోర్స్ మై డియర్.
ఈ అందం మొత్తం నీ సొంతమే నీ స్పర్శ కోసమే అల్లాడిపోతోంది నా ప్రాణం అంటూ అమ్మాయి తన ఒంపు సొంపులు అన్ని కనబడే లాగా బెడ్ మీద పడుకుంది.

అరచేయి వెన్నుకి పట్టి అదిమి తన మీదకి లాక్కున్న అతడు ఆమె పరువాలను తన ఛాతికి తగలకుండా అర సెంటీమీటర్ గ్యాప్లో ఆపి ఆమె లిప్స్ వైపు కోరికగా చూస్తూ ముందుకు వంగుతుంటే ఇద్దరి మొహాల మీద కొన్ని రోజెస్ అడ్డు వచ్చాయి.

కట్….

అన్న సౌండ్ కి అబ్బాయి తన యాక్టింగ్ పార్ట్నర్ అయిన సీమ నీ వదిలేసి అర నిమిషంలో డైరెక్టర్ పక్కన నిలబడ్డాడు.

తంసప్ చూపించిన డైరెక్టర్ ఈ క్లైమాక్స్ తో మూవీ కంప్లీట్ అయిపోయింది సార్ నెక్స్ట్ మంత్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాల్సి ఉంటుంది అప్పటివరకు మీరు వేరే మూవీస్ సైన్ చేసుకోవచ్చు అని చెప్పగానే అతడికి ఒక లుక్ ఇచ్చేసి తన క్యారీ వ్యాన్ లో కూర్చున్నాడు సిద్ధార్థ్ రాజ్.

28 సంవత్సరాల యంగ్ అల్టిమేట్ హీరో.
మహేష్ బాబు తర్వాత అంత అందం సిద్ధార్థ్ కే ఉంది అని రెండు తెలుగు రాష్ట్రాలు నమ్మింది.

మూడు సినిమాలతోనే ఒక ఊపు ఊపి టయర్ వన్ క్యాటగిరీలోకి చేరిపోయాడు మన హీరో బాబు.

మిల్కీ వైట్ స్కిన్ టోన్ 6.2 ఫీట్ హైట్ జిమ్ బాడీ బ్రహ్మ ఆల్ డ్యూటీస్ పక్కన పెట్టి వీడిని చెక్కడమే పనిగా పెట్టుకున్నట్లు సృష్టించిన రూపం..

ఈ ఫీచర్స్ తో ఉన్న సిద్ధార్థ్ ఆల్రెడీ అతని సినిమాలు చూసిన ప్రతి అమ్మాయికి నిద్రలేని రాత్రులు ఎన్నో గిఫ్ట్ గా ఇచ్చాడు తన అందంతో..

మనోడి పేరు సిద్ధార్థ్ రాజ్ అయినా కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఎస్ ఆర్ గానే అందరికీ సుపరిచితం.

కానీ అతనికి అమ్మాయిల మీద ఉన్న నాలెడ్జ్ అండ్ ఇంట్రెస్ట్ గుడ్డు సున్నా.

అతడి కోసం అని ఇందాక ఆక్ట్ చేసిన కోస్టార్ స్లీవ్ లెస్ బ్లౌజ్ మీద శాలువా కూడా కప్పుకోకుండా సిద్ధార్థ కోసం పరిగెత్తేలోపు క్యారీ వ్యాన్ స్టూడియోస్ కూడా దాటిపోయింది.

చ ఎప్పుడు ఇంతే వీడు పెద్ద ఆటిట్యూడ్ ఫెలో వీడిని పడగొట్టేవాడు రాడని ఫీలింగ్ అయినా సరేలే ఆ అందానికి ఆ మాత్రం ఆటిట్యూడ్ లేకపోతే ఎలా అనుకుంటూ నెక్స్ట్ సినిమా కోసం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళింది సీమ.

ఒక అందమైన పల్లెటూరు.

చారు..
అబ్బా ఇప్పుడే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ వచ్చిందే
ఎస్ ఆర్ మూవీ కంప్లీట్ అయిపోయిందంట నెక్స్ట్ మంత్ నే రిలీజ్ .
సినిమా లో ఇంత బాగుంటే రియల్ గా ఇంకెంత బాగుంటాడో అని ఒక అమ్మాయి చెట్టుమీద జాంపండు కోస్తున్న చారు తో అంది అలియాస్ చారులత.

చి నోరు ముయ్ ఎప్పుడు చూడు ఆ హీరోల వెంట పడడమే వాళ్ళు ఏమైనా మనకు తిండి పెడుతున్నారా ఆ మాత్రం ధ్యాస ఏరోజైనా మీ అమ్మకి బాలేనప్పుడు వండి పెట్టడంలో చూపెట్టావే నువ్వు నీకు తెలియదు ఆ సినిమా వాళ్ళు చాలా గబ్బోలు ఏవేవో పనులు చేస్తారంట వద్దులే వాళ్ల గురించి ఎంత తక్కువ తెలుసు కుంటే అంత మంచిది పైగా ముందు సినిమాలో భార్యగా చేసినావిడతో వచ్చే సినిమా lo చెల్లెలి ఛాన్స్ వచ్చిన చేస్తారంట అదేం మాయ రోగం వాయి వరసలు లేకుండా?
అంటున్న చారులత తన లంగా వోని లోని కొంగులో డజన్ పండ్లు తెంపుకొని కిందకి దిగేలోపు ఆమె గజ్జల చప్పుడికి తోటమాలి ఎవరక్కడ అని అరవడంతో భూమికే దెబ్బ తగులుతుందేమో అన్నట్లు పరిగెడుతున్న ఆమె తీరుకి ఫ్రెండ్ దొరికామంటే దరువే పదా అని లాక్కెళ్ళిపోయింది.