🙏ఆదిపరాశక్తి🙏 – 1
ఇంకాసేపు ఉంటే తూర్పున తెలతెలవారుతోంది… పచ్చగా చీరకట్టుకున్నట్టుండే ఉన్న గోదావరి జిల్లాలోని ఆ పల్లెటూరిని మంచు దుప్పటి కప్పేసిఉంది
ఊరి చివర ప్రవహించే ఏటి గట్టును ఆనుకుని ఉన్న అమ్మవారి గుడిలో గంటల చప్పుడు బాగా గట్టిగా అనిపిస్తుంది…
దసరా పండుగకు ఇంకా మూడు రోజులే టైం ఉంది…
గుడిలో పూజారి అప్పారావు పంతులు గారు గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి
పసుపు కుంకుమలతో నిండుగా అలంకరిస్తున్నాడు గుడి బయట వేపచెట్టు కింద దీపాలు వెలిగిస్తున్న కొందరు ఆ గుడికి వచ్చిన భక్తులు…
“పంతులు గారూ.. దసరాకి ఇంకో మూడు రోజులే ఉంది ఏటేటా మన ఊరి సర్పంచ్ గారే గుడికి సున్నాలు వేయించేవారు..
మరి ఈసారి ఏంటండీ ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు..? అంతేకాకుండా గుడిలో ఇంకా పండగ కళే కనిపించడం లేదు..” అని అడిగాడు పక్కనే కొబ్బరికాయ కొడుతున్న ఆ ఊర్లోనే ఉంటున్న రామన్న…
అప్పారావు పంతులు చేతిలో ఉన్న హారతి పళ్లాన్ని అమ్మవారి పాదాల కింద పెట్టి.. ఆమె ఉగ్రరూపం వైపు ఒక్కక్షణం తిక్షణంగా చూసిన ఆయన ముఖంలో ఏదో తెలియని ఆందోళన…
“నాయనా రామయ్య… అమ్మవారికి సున్నాలు..రంగుల అలంకరణలు ముఖ్యం కాదు… అమ్మ మీద మనసు నిండా భక్తి ఉంటే చాలు…కానీ… ఎందుకో ఈసారి దసరాకి గుడిలో ప్రశాంతత కంటే.. ఏదో అరిష్టం పొంచి ఉన్నట్టు అనిపిస్తోంది…
మన చల్లని అమ్మవారి కళ్లలో ఉగ్రం కనిపిస్తోంది… పండగ నాటికి ఊళ్లో ఏం జరుగుతుందో ఏమో ఆ తల్లికే ఎరుక” అంటూ నిట్టూర్చాడు… అప్పారావు గారు
అతను అన్న ఆ మాటలకు.. అక్కడ ఉన్న భక్తుల ముఖాల్లో ఒక్కసారిగా భయం ఛాయలు తొంగి చూస్తాయి
అంతే అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఏదో భయంకరంగా మారింది.
అప్పుడే ఆ భక్తులు భయంతో కొట్టిన ఆ గుడి గంటల చప్పుడు ఊరి మధ్యలో ఉన్న భార్గవి ఇంటి వరకు వినిపిస్తోంది…
వంటగదిలో కట్టెల పొయ్యి మీద పప్పు ఉడుకుతున్న వాసన ఇల్లంతా వ్యాపించింది…భార్గవి చేతులు చకచకా పనిచేస్తున్నాయి. భర్త ఆనంద్ ఉదయాన్నే పొలానికి వెళ్లిపోయాడు…
ఆయన కోసం వేడివేడిగా అన్నం, మామిడికాయ పప్పు, వడియాలు వేయించి క్యారేజీలో సర్దుతోంది… ఎంత గ్యాస్ పోయి ఉన్నా కానీ తన భర్తకి ఆమె స్వయంగా తన చేతులతో పొయ్యి మీద వండిన వంటే పెడుతుంది
అప్పుడప్పుడు పొలం పనులు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే తన భర్త అతను చెప్పిన మాట వినలేదని గొడవ పడితే అతి కష్టం మీద గ్యాస్ స్టవ్ మీద కూడా వండుతుంది…
ఆమె చేతికి ఉన్న మట్టి గాజుల చెప్పడు ఆ..ఇంటికే ప్రాణం పోస్తున్నట్టుగా ఉంటుంది..ఇది తన భర్త ప్రతిరోజు చెప్పే మాటే..
క్యారేజీకి మూతపెట్టి తన చీరకొంగుతో ముఖం మీద పడుతున్న చెమట తుడుచుకుంటు హాల్లో ఉన్న అమ్మవారి పటం ముందు నిలబడి దణ్ణం పెట్టుకుని అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమనే తన నుదుటున సింధూరంగా దిద్దుకుంది…
తన చేతిలో క్యారేజీ ఉన్న బుట్ట పట్టుకుని పచ్చని పొలాల గట్ల మీద నడుచుకుంటూ వెళ్తోంది భార్గవి… స్వచ్ఛమైన గాలి.. పక్షుల కిలకిలరావాలు… ఆమె అడుగుల్లో పాటు లేబద్ధంగా పరుగులు పెడుతున్న పిల్ల కాలువలు పరవాలేదు తొక్కుతుంటే
తన భర్త మీద ఉన్న అంతులేని ప్రేమ ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది….
ఊరి చివర అమ్మవారి గుడికి ఆనుకునే భార్గవి భర్త చంద్ర శేఖర్ కి చెందిన మూడెకరాల మామిడి తోట ఉంది… చెమటలు కక్కుతూ తన చేతిలో ఉన్నగడ్డపారతో కాలువకు నీళ్లు మళ్లిస్తున్నాడు చంద్ర…
అప్పుడే అక్కడికి వచ్చిన భార్గవి”ఏవండీ… కాస్త ఆపండి..పొద్దున్నే టీ కూడా తాగకుండా వచ్చేశారు..రండి ఇలా నీడకు.. నాలుగు మెతుకులు తిని తర్వాత మొదలు పెట్టొచ్చు” అంటూ చెట్టు కింద చాప పరుస్తూ పిలిచింది భార్గవి…
భార్గవి మాటలు విన్నా అతను తన చేతిలో
ఉన్న గడ్డపార పక్కన పడేసి చేతులు కడుక్కుని వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు…
భార్గవి.. క్యారేజీ తెరిచి అన్నం వడ్డిస్తుంటే ఆకలితో ఉన్న అతను చేతితోనే ముద్ద కలుపుతూ భార్య వంక ప్రేమగా చూశాడు…
“కూర అద్భుతంగా ఉందే భార్గవి… నువ్వు వండి పెడుతుంటే ఈ తోటలో నేను చేసే కష్టం అంతా ఇట్టే.. మరిచిపోతున్నా” అన్నాడు నవ్వుతూ… అతను
“అయ్యో.. నా వంటలో ఏముందండీ…? అంతా ఆ వెనక ఉన్న అమ్మవారి దయ… ఆ.. తరువాత మీ కష్టం తోటంతా పచ్చగా కళకళలాడుతోంది….
“ఈ..ఏడు మామిడి పూత కూడా బాగా వచ్చినట్టుంది..” అంది చెట్ల వైపు చూస్తూ… భార్గవి
“అవును భార్గవి.. ఈ మూడెకరాలే మన బతుకు… మా తాతల నాటి భూమి… పక్కనే అమ్మోరు గుడి ఉండటం మన అదృష్టం…దసరా పండగ వస్తోంది కదా.. ఈసారి పంట చేతికి రాగానే నీకు మంచి పట్టుచీర.. అమ్మవారికి పట్టు వస్త్రాలు కొందాం….”అని ఆనందంగా పొలం చుట్టూ చూస్తూ అన్నాడు చంద్ర
భర్త అన్న మాటలకి భార్గవి సంతోషంగా తల ఊపింది… అవును అన్నట్టుగా వారి పేదరికం లోఉన్న కాని వారి మధ్య ఉన్న అన్యోన్యత ఆ.. మామిడి తోటకి మరింత అందాన్ని తెచ్చింది…
కానీ..ఈ ప్రశాంతతకి బహుదూరంలో లేదు ఆ ఊరి సర్పంచ్… క్రూరమైన భూస్వామి వీరభద్రం బంగళా.
ఊరి మధ్యలో కోట లాంటి పెద్ద ఇల్లు గడప దాటి లోపలికి వెళ్తే ఆ ఇంట్లో భయం పుట్టే వాతావరణం…
ఆ ఇంటి పెరట్లో రెండు పెద్ద వేట కుక్కలు గట్టిగా అరుస్తున్నాయి… వరండాలో వేసిన ఖరీదైన కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని..చుట్ట కాలుస్తున్నాడు వీరభద్రం…
అతని కళ్లలో ఉన్న క్రూరత్వం తన ఎదుటివాడిని సైతం బతకనివ్వని నైజం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి…
అతని కాళ్ల దగ్గర వయసు మీద పడిన ఒక పేద రైతు అతని కాళ్ళని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ప్రాధేయపడుతున్నాడు…
“అయ్యా వీరభద్రం బాబూ.. నా మీద కాస్త జాలి చూపించయ్యా… దసరా పండగ దాకా కాత ఆగయ్య బాంచెన్… నా కూతురు పెళ్లి చేసాక.. నేను అప్పు తీసుకున్న కాడికి నా పొలం నీకే రాసిచ్చేస్తా ఆపైన ఇంకేమీ మాట్లాడను” అని అంటూ కన్నీరు..మున్నీరుగా ఏడుస్తూ వీరభద్రాన్ని బతిమిలాడుతూ అడుగుతున్నాడు… అతను
కానీ వీరభద్రం చుట్ట పొగను గాలిలోకి వదులుతూ గట్టిగా నవ్వుతూ తన కాలుతో ఆ రైతును పక్కకు తన్నాడు… కోపంగా”నీ కూతురు పెళ్ళికి నాకెందుకురా జాలి..?
నేను అప్పు ఇచ్చింది నీ కష్టాలు తీర్చడానికి కాదు.. నీ పొలం నీ దగ్గర నుంచి నీ పొలాన్ని లాక్కొని నా సొంతం చేసుకోవడానికి… రేపు పొద్దున్నే రిజిస్ట్రేషన్ ఆఫీసులో.. నువ్వు పేపర్స్ మీద కచ్చితంగా సంతకం పెట్టాలి.. అంతే…!” అని అరిచాడు అతను
అంతే అతను అలా గట్టిగా అరిచాడో లేదో వెంటనేఅతని ముఖ్య అనుచరుడు సూరి ఆ రైతును జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లిపోయాడు… కొంచెం కూడా జాలి లేకుండా..
అక్కడే నిలబడి అది చూస్తున్న వీరభద్రం పక్కనే ఉన్న టేబుల్ మీద ఊరి మ్యాప్ పరుచుకుని ఉంది… అందులో ఒక ప్రాంతాన్ని ఎర్రటి కలంతో గుండ్రంగా గీసి పెట్టాడు. అదే చంద్ర మామిడి తోట…
ఆ పేరు రైతుని గేటు వరకు ఈడ్చి బయట విసిరేసి లోపలికి వచ్చిన సూరి “అన్నయ్యా.. వాడి సంగతి నేను చూసుకుంటాలే. కానీ ఈ చంద్రగాడి పొలం విషయమే.. ఎమి తేలడం లేదు…
“వాడికి ఎన్నిసార్లు కబురు పెట్టినా ససేమిరా అంటున్నాడు… మొన్నటికి మొన్న ఆ దేవుడి గుడి సాక్షిగా ఒక్క అంగుళం కూడా ఇవ్వనని నా ముఖం మీదే చెప్పేసాడు…” అన్నాడు కోపంగా… ఊగిపోతూ సూరి
సూరి మాటలు విన్న వెంటనే వీరభద్రం టేబుల్ మీద ఉన్న బీరు గ్లాసును చేతిలోకి తీసుకుని..”ఆ ఆనంద్ గాడి మూడెకరాల వెనకాలే అమ్మోరు గుడి ఉంది…
“అక్కడ ఆ గుడిని కూడా కలుపుకుని ప్లాట్లు వేస్తే మన రియల్ ఎస్టేట్ వెంచర్‌కి కోట్ల రూపాయల లాభం వస్తుంది… రా ఆ పొలం ఎలాగైనా దసరా లోపు నా చేతికి రావాలి సూరి… నువ్వేం చేస్తావో ఏమో నాకైతే అవి కావాలి” అన్నాడు కోపంగా వీరభద్రం
“వాడు ప్రాణం పోయినా ఆ తోటను వదలడు అన్నయ్యా… వాడు ఒట్టి మొండిఘటం” అన్నాడు సూరి… తన అన్నయ్యతో
సూరి అన్న మాటలతోవీరభద్రం కళ్లలో రాక్షసత్వం బయటపడింది దాంతో అతని చేతిలో ఉన్న గ్లాసును బలంగా నేలకేసి కొట్టాడు…
దంతో గ్లాసు ముక్కలు ముక్కలైంది…
“అయితే వాడి ప్రాణమే తీసేద్దాం. మాట వినకపోతే అడ్డం తొలగించడమే నాకు తెలిసిన సిద్ధాంతం…వాడు దసరా పండగ చూసుకుని మురిసిపోతున్నాడు కదా.. వాడికి ఈ దసరా ఆఖరిది కావాలి…
పండగ పూట ఆ అమ్మోరుకి వాడి నెత్తురును బలి ఇద్దాం… ఈ రాత్రికి మనోళ్లని వాడి పొలం దగ్గరికి పంపు.. ఏం చేయాలో నీకు తెలుసు కదా..” అన్నాడు కసిగా నవ్వుతూ… వీరభద్రం
వీరభద్రం నవ్వుకు ఆ బంగళా గోడలు కూడా భయపడినట్టుగా అనిపించాయి… అతని చుట్టూ ఉన్న జనాలకి.. కుట్ర పకడ్బందీగా మొదలైంది…
ఇక్కడ ఇలా ఉండగా మరోవైపు ఆనంద్ భార్గవి ఈ రాబోయే తుఫాను గురించి ఏమాత్రం తెలియకుండా తమ చిన్న ప్రపంచంలో సంతోషంగా ఉన్నారు…
( గర్భగుడిలో ఉన్న ఆ… అమ్మవారి ఉగ్రరూపం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో కాలమే నిర్ణయించాలి…)
మరో అప్డేట్ తో కలుసుకుందాం……
ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అయిపోండి ఇది కాంపిటీషన్ కోసం రాస్తున్న స్టోరీ కనుక
మీ సహాయ సహకారాలు నాకు ఇవ్వండి
ఆదిపరాశక్తి మిమ్మల్ని మెప్పిస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నన్ను ఫాలో కొట్టి ప్రోత్సహించండి
మీ దుర్గ…..🙏
Swipe left/right or tap the sides to turn pages