డార్క్🖤రొమాన్స్ -1 – 3
మీరు నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? అంటూ…కీర్తి తన లోపల గుండెల్లో కలుగుతున్న భయాన్ని బయటికి కనపడకుండా కంట్రోల్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది………………
రుద్రాక్ష చేస్తున్న హెచ్చరికలకు తాను లొంగిపోలేదని, పైకి ధైర్యం తెచ్చుకుని అతనిని సూటిగా ప్రశ్నిస్తుంది……………
అప్పుడు రుద్రాక్ష్, కీర్తి ప్రశ్నకు మాటలతో సమాధానం చెప్పకుండా, చాలా నిశ్శబ్దంగా ఆమె వైపుగా అడుగులు వేస్తూ మరింత దగ్గరకు జరుగుతాడు……………..
రుద్రాక్ష్, ఆమెకి మరింత దగ్గరకు రాగానే అతని శరీరం నుండి వచ్చే సువాసన కీర్తిని తాకింది. అయితే ఆ వాసన చాలా విచిత్రంగా ఉంది…ఒకపక్క దైవికమైన, ప్రశాంతతను ఇచ్చే చందనం సువాసన ఉంటే, మరోపక్క భయానకమైన రక్తపు వాసన కలిసి ఉంది……………
ఇది అతనిలోని ప్రశాంతతను, అలాగే అతని వెనుక ఉన్న భయంకరమైన, శాపగ్రస్తుడైన చీకటి రూపాన్ని సూచిస్తుంది…………..
అతడు కీర్తి ప్రశ్నలకు మాటలతో బదులివ్వకుండా, అతను ఒక్కసారిగా మౌనంగా ఆమె ముఖానికి అతి సమీపానికి వస్తాడు………….
అలా దగ్గరికి వచ్చిన, అతని ఆకర్షణీయమైన, లోతైన నీలి కళ్ళలోకి కీర్తి చూడగానే… అతను కేవలం ఆమెను బయటికి చూడటమే కాకుండా, ఆమె మనసులోని భయాలను, ఆలోచనలను, అణచిపెట్టుకున్న రహస్యాలను కూడా నేరుగా చదివేస్తున్నట్లుగా ఆమె అనుభూతి చెందుతుంది……………..
రుద్రాక్ష్, ఉన్న భయానక వాతావరణం, అతని తీవ్రమైన రూపం చూసి కీర్తి కి లోపల వణుకు పుట్టింది… కానీ అదే సమయంలో, అతనిలోని ఆకర్షణీయమైన రూపురేఖలు, ఆ నీలి కళ్లలోని విషాదం ఆమెకు తెలియకుండానే అతనివైపు లాగేస్తున్నాయి. దాంతో అతనిని తాకాలని ఒక బలమైన కోరిక ఆమె మనసులో పుట్టింది……………
చూడు కీర్తి, నన్ను చూసి నువ్ఎం దుకు భయ పడుతున్నావ్.?
అసలు, నన్ను చూసి భయపడాల్సిన పని లేదు.? ముందు నీ మనసులో ఉన్న ఆ భయాన్ని తీసేస్తే ? నేను దానికి ఒక నిజమైన రూపాన్ని ఇచ్చి, నువ్వు దానితో నేరుగా పోరాడేలా చేస్తాను. అని రుద్రాక్ష్ పరోక్షంగా కీర్తికి చెబుతాడు………….
ఆ తరువాత, అతను తన జేబు నుండి ఒక చిన్న, పదునైన వెండి కత్తిని తీశాడు.?అది అద్భుతంగా చెక్కబడి ఉంది, దాని పిడిపై ఒక ఎర్రటి రూబీ కలిగి ఉంది…………..
అతను,ఆ కత్తిని తీసి నేరుగా కీర్తి వైపు గురిపెట్టాడు..రుద్రాక్ష్ ఆమె వైపు కత్తిని గురి పెట్టేసరికి, ఆమెలో తక్షణమే తనకేదో ప్రమాదం జరగబోతుంది అని ఆమె మనసు హెచ్చరిస్తుంది………….
అలా ఆమె మనసు హెచ్చరించేసరికి, అకస్మాత్తుగా అతని చేతిలో మెరుస్తున్న ఆ పదునైన కత్తిని చూసి కీర్తి తీవ్ర భయానికి గురై, తన ప్రాణ రక్షణ కోసం వెనక్కి అడుగులు వేసింది……………
ఈ ప్రమాదకరమైన కత్తిని నా ఎదుట
పెట్టిన, నువ్వు……….
నాతో ఏం చేయించాలనుకుంటున్నావ్.?
అని ఆమె ఆశ్చర్యంతో…హడలిపోతూ. అతనిని ప్రశ్నిస్తుంది……………
అప్పుడు అతను, ప్రతి పౌర్ణమికి, నేను ఈ ఎస్టేట్ యొక్క పూర్వీకుల కోసం ఒక ఆచారాన్ని నిర్వహిస్తాను.. అంటాడు…………
ఈ ‘బ్లాక్ రోజ్ ఎస్టేట్’ కేవలం, ఒక పాత భవనం మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి నెలా వచ్చే పౌర్ణమి నాడు ఒక అతీంద్రియ, చీకటి ఆచారం జరుగుతుందని రుద్రాక్ష్
వివరిస్తాడు………….
ఈ ఎస్టేట్‌ను నిర్మించిన తరువాత మా పూర్వీకుల ఆత్మల కోసం ఈ పూజ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది………..
ఈ పూజ కోసం, ఎవరిది పడితే వాళ్ళ రక్తం పనికి రాదు.?
కేవలం ఒక ప్రత్యేకమైన, గుర్తు పట్టని వ్యక్తి రక్తం మాత్రమే కావాలని అంటాడు.రుద్రాక్ష్…………
అంటే…ఆ..వ్యక్తి నేనా..అని నేను గొంతు చించుకుంటూ అడిగాను.?
అప్పుడు అతను కీర్తి, వైపు చూస్తూ..ఒకవైపు ఆమె మీద అతనికి ఉన్న, గాఢమైన ఆకర్షణ ఉన్నప్పటికీ, మరోవైపు ఆమెను ఈ భయానక శాపంలో భాగం చేయాల్సి వస్తున్నందుకు అతని మనసులో ఉన్న బాధ, ఈ రెండూ ఆ సమయంలో అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి…………..
ఆ శాపం ఎవరిని బలి కోరుతుందో, ఖచ్చితంగా నాకు తెలియదని అంటాడు…రుద్రాక్ష్ , అసలు ఆ శక్తులు ఎవరిని ఎంచుకుంటాయో ముందస్తుగా ఊహించడం సాధ్యం కాదని అంటాడు……………..
ఈ భవనంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి, అడుగుపెట్టినప్పుడు, ఇక్కడి అశాంతిని నివారించడానికి లేదా పూర్వీకుల ఆత్మలను శాంతింపజేయడానికి ఆ కొత్త వ్యక్తి యొక్క రక్తాన్ని, అర్పించడం, ఏకైక మార్గమని రుద్రాక్ష్. వివరంగా చెప్తాడు………………
అంటే ఈ ఎస్టేట్ శాపం ఎప్పుడూ తాజా రక్తాన్ని కోరుకుంటూనే ఉంటుంది…………..
మా పూర్వీకులు గతంలో చేసిన క్రూరమైన చర్యల వల్ల ఈ భూమి శాపగ్రస్తమైంది. వాళ్ళు చేసిన ఆ పాపాలకు,ఈ రక్తపాతానికి ఇప్పుడు కాలం చెల్లించింది కాబట్టి, ఆ మూల్యాన్ని ప్రస్తుత తరంగా నేనే చెల్లించక తప్పదని రుద్రాక్ష్ తన ఆవేదన ను వ్యక్తపరుస్తాడు………………
కోపం, కక్ష , ద్వేషం ఉంటాయి. కానీ రుద్రాక్ష్ లో అలాంటి దుర్బుద్ధి ఏదీ లేదు.
తను కీర్తికి హాని చేయాలని కోరుకోవడం లేదని, తరతరాలుగా తన కుటుంబాన్ని వెంటాడుతున్న “విధి” నుండి తను, తప్పించుకోలేకనే ఈ పరిస్థితి ఏర్పడింది అని
కీర్తి గ్రహిస్తుంది………………
హాయ్..ఫ్రెండ్స్, స్టోరీ మీకు నచ్చినట్లయితే..రేటింగ్ అండ్ కామెంట్స్ ఇచ్చేయండి.
అలాగే స్టోరీ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఫ్రెండ్స్, సరిచేసుకుంటాను.👍
నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం..అంతవరకు సెలవు..🙏
మీ..భార్గవి..✍️
Swipe left/right or tap the sides to turn pages