Mr. రాక్షాస్ – 2
దేవుడా అసలేంటి నాకి బాధ అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయి
కొంచెం సేపటికి తల మొత్తం బరువుగా అనిపిస్తూ ఉంటే ఫోన్ పక్కన పెట్టేసి పడుకుండిపోయింది జనని
నెక్స్ట్ డే మార్నింగ్
ఉదయాన్నే తన ఫ్రెండ్ నిద్రలేపడంతో బద్దకంగా లేచి కూర్చుంది జనని
జనని ఏంటే ఈ టైం వరకు ఇంత మోద్దు నిద్ర లే ఫాస్ట్ గా లేచి రెడీ అవ్వు కాలేజీకి టైం అయిపోతుంది నాకు ల్యాబ్ ఉంది నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఫాస్ట్ గా రెడీ అయ్యి క్లాస్ కి వెళ్ళిపో సరేనా బాయ్ బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది జనని బెస్ట్ ఫ్రెండ్ మైత్రి
గాయత్రి వెళ్లిపోయాక డోర్ లాక్ చేసేసుకుని అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది
తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన మొబైల్ కి మెసేజ్ నోటిఫికేషన్ ఉండటంతో ఓపెన్ చేసి చూసింది
అది రానా నుంచి కావడంతో కొంచెం భయపడుతూనే మెసేజ్ ఓపెన్ చేసింది
మీట్ యు ఎట్ ది @@@@@ హోటల్ షాప్ 10 పీఎం అంటూ ఉన్న మెసేజ్ చూసిన జనని కళ్ళు ఒక్కసారిగా వర్షించాయి
కొంతసేపటికి తనని తానే కంట్రోల్ చేసుకుంటూ జనని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నావు కదా మళ్లీ ఎందుకు ఏడుపులు నువ్వు ఏడ్చినంత మాత్రాన నీ ఫేట్ మారిపోదు జనని ఇకనుంచి నువ్వు అవునన్నా కాదన్నా రానా తోనే నీ జీవితం నిన్ను ఏమైనా చేసుకునే హక్కు అధికారం అతనికి ఉన్నాయి ఇంకా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు ఏడవడంలో అర్థం ఏంటి అని తన మనసు తనని ప్రశ్నిస్తూ ఉంటే ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇలా ఏడవడంలో అర్థం లేదు అతని నన్ను ఫోర్స్ చేయలేదు జస్ట్ ఆఫర్ ఇచ్చాడు ఆఫర్ కి నువ్వు కూడా ఒప్పుకున్నావు అలాంటప్పుడు ఇంక నువ్వు ఇలా బాధపడటం ఎందుకు అనుకుంటూ ఆలోచిస్తూ ఇక కాలేజ్ కి వెళ్లొద్దు అని డిసైడ్ అయ్యి ఆరోజు అక్కడే ఉండిపోయింది
ఇక నైట్రికి ల్యాబ్ అయిపోయిన తర్వాత రూమ్ కి రా అని మెసేజ్ పెట్టేసి కొంచెం సేపు అలానే పడుకుండిపోయింది
ఏమైంది దీనికి క్లాస్ కి వెళ్లకుండా నన్ను రూమ్ దగ్గరికి రమ్మంటుంది ఏంటి అనుకుంటూ ల్యాబ్ అవ్వగానే గబగబా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయింది
బయటనుంచి డోర్ తడుతూ ఉంటే అప్పుడు మెలకువ వచ్చి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది జనని
ఏమైందే అంతా ఓకే కదా ఎందుకలా మెసేజ్ చేసావ్ అయినా నువ్వు ఎందుకు క్లాస్ కి వెళ్ళలేదు అసలు అడిగింది మైత్రి
మైత్రి నీ దగ్గర నేనొక విషయం దాచాను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి కాబట్టి నీకు చెప్తున్నాను నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పకు అంటూ తన మెడలో దాచుకున్న తాళిబొట్టుని బయటకి తీసి చూపించింది
జననీ మెడలో తాళిబొట్టు చూసిన మైత్రి ఒక్కసారిగా షాక్ అయింది
జనని ఏం చేస్తున్నావే పెళ్లి చేసుకున్నావా ఎప్పుడు ఎక్కడ ఎవరిని అంటూ షాకింగ్ గా వరస పెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది మైత్రి
టు వీక్స్ అవుతుంది అతను నాకు టు వీక్స్ టైం ఇచ్చాడు పెళ్లి తర్వాత తన దగ్గరికి తీసుకొని వెళ్లడానికి ఈరోజుతో ఆ టైం అయిపోయింది ఈరోజు ఈవినింగ్ నేను హాస్టల్ వికెట్ చేసి అతనితోపాటు అతని ఇంటికి వెళ్ళిపోతున్నాను
అసలు ఆంటీ అంకుల్ కి తెలుసా ఈ విషయం
అయితే అంకుల్ బెడ్ మీద ఉంటే నువ్వు పెళ్లి ఎలా చేసుకున్నావే
నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టే డాడీ ఇంకా అలా ప్రాణాలతో ఉన్నారు అవన్నీ వదిలేసేయ్ నువ్వు మాత్రం ఇకనుంచి జాగ్రత్తగా ఉండు నేను స్టడీస్ కంటిన్యూ చేస్తాను లేదో కూడా నాకు తెలియదు. నేను అతన్ని అడగలేదు నైట్ అడగాలి అంది జననీ
ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరే
రానా ఆర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత రాణా చక్రవర్తి
ఆ పేరు విన్న మైత్రి ఒక్కసారిగా షాక్ అయింది
ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంది మా బావ నా అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఫ్రెండ్ వైపు చూసింది
మైత్రి చెప్పిన దానికి బుర్ర గిర్రున తిరిగింది జననీ కి
————-continues…………
స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా ఎవరైనా మన అకౌంట్ ని ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఇప్పుడే ఫాలో అయ్యి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు అని కోరుకుంటున్నాను
నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో :-
వెళ్లాలి కదా మైత్రి అంది జనని నిర్జీవంగా
సరే జాగ్రత్త నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని మర్చిపోకు నువ్వు నాకు ఒక్క ఫోన్ చెయ్ నేను అక్కడికి రాగలను సరేనా ఏమైనా బాధగా ఉన్నా కూడా నువ్వు ఒక్కదానివే ఫీల్ అయిపోయి బాధపడిపోకు ప్రతిదీ ఇదివరకు నాతో ఎలా షేర్ చేసుకున్నావో ఇప్పుడు కూడా అలాగే షేర్ చేసుకో ఇక మీద కూడా అర్థమైందా అయినా నాకు నీ మీద చాలా కోపంగా ఉందే చెప్పా పెట్టకుండా అలా ఎలా పెళ్లి చేసుకుంటావే అడిగింది మైత్రి
Swipe left/right or tap the sides to turn pages