New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
బ్లడీ ఇష్క్ – 2

బ్లడీ ఇష్క్ – 2

” సార్ ” చిన్నగా పిలిచింది ఆమె. 

 

ఏంటన్నట్టు చూశాడు.  

 

” మీరు నాకు చెప్పినట్టే చేస్తారు కదా నమ్మొచ్చు కదా  మిమ్మల్ని ??? ” అడిగింది ఆమె అనుమానంగా 

 

ఆ మాటలు విన్న అతని పెదాల మీద ఒక క్రూరమైన కన్నింగ్ నవ్వు వచ్చింది  

 

ముందు నాకు ఇది చెప్పండి మీరు మా నాన్నగారిని విడిపిస్తారు కదా ఎలా అయినా ఆయన్ని రక్షిస్తారు కదా ఆశగా అడిగింది అక్షర 

 

నీ బాబు ఇరుక్కుంది ఏదైనా అల్లాటప్ప కేసు అనుకుంటున్నావా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు మొత్తం దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారాడు మీ బాబు ఈ వేడి కొంచెం చల్లారితే కానీ నీ బాబుని బయటకు తీసుకొని రాలేను అయినా అగ్రిమెంట్ వన్ వీక్ కి కదా అయినా ఇంకా కేవలం వన్ నైట్ మాత్రమే అయింది ఇంకా చాలా డేస్ అలాగే చాలా నైట్స్ ఉన్నాయి బేబీ మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు అతను 

 

ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయింది అక్షర 

 

అతను లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు 

 

అలానే మంచం మీద వాలి శూన్యంలోకి చూస్తున్నట్టు ఆ రూమ్ సీలింగ్ వైపు చూస్తూ కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది 

 

శరీరం అలసిపోయి ఉండడంతో ఎప్పటికో తన ఆలోచనల మధ్య నిద్రకి ఉపక్రమించింది 

 

అక్కడి నుంచి పక్క రూమ్ కి వచ్చిన అతను ఫ్రెష్ అయ్యి పై అంతస్తు లో ఉన్న జిమ్ రూమ్ కి వెళ్ళాడు 

 

కాసేపు అక్కడే తిరుగుతూ వర్కౌట్స్ చేసుకుని అక్కడి నుంచి అక్షర ఉన్న రూంలోకి వచ్చాడు 

 

అప్పుడే మెల్లగా నిద్ర లేస్తూ ఉంది అక్షర 

 

గుడ్ మార్నింగ్ బేబీ కన్నింగ్ స్మైల్ తో విష్ చేశాడు 

 

నిద్ర మబ్బు మొహంతోనే లేచి దుప్పటి నిండుగా కప్పుకొని కూర్చుంది అక్షర 

 

ఇంత మార్నింగ్ నే నిద్ర లేచావ్ ఎందుకు బేబీ ముని వేళ్ళతో ఆమె చెంపలను మీటుతూ అడిగాడు  

 

ఆఫీస్ కి రావాలి కదా సార్ వణుకుతున్న స్వరంతోనే అతనికి బదులిచ్చింది 

 

ఆఫీస్ కా ఎందుకు ఎవరు చెప్పారు నువ్వు ఆఫీస్ కి రావాలి అని యాటిట్యూడ్ అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది 

 

అదేంటి నేను ఆఫీస్ కి రావట్లేదా ఆశ్చర్యంగా అడిగింది అక్షర 

 

చూడు వన్ వీక్ నువ్వు నా సొంతం నేను ఇప్పుడు కావాలి అంటే అప్పుడు నీ దగ్గరికి వస్తాను అలా వచ్చిన టైంలో నువ్వు ఆఫీసులో ఉంటే నాకెలా అవుతుంది చెప్పు అప్పుడు అగ్రిమెంట్ రూల్స్ బ్రేక్ చేసినట్టు అవుతుంది అప్పుడు అది ఇంకా కష్టం కదా అన్నాడు అతను 

 

కానీ నేను మా ఇంటికి వెళ్ళాలి మా అమ్మా చెల్లి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నేను కనీసం రోజు లో ఒక్క సారి అయినా వాళ్ళని కలవడానికి వెళ్ళాలి అంది  

 

ఏం అవసరం లేదు ఇద్దరు పని వాళ్లు వెళ్తారు చెప్తున్నాను కదా నాకు ఎప్పుడు నువ్వు కావాలి అనిపిస్తే అప్పుడు వస్తాను నువ్వు నో చెప్పడానికి నీకు కూడా రైట్ లేదు అలాంటిది నాకు నువ్వు కావాలి అనిపించిన టైం లో నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఎవడు ఉంటాడు పొగరుగా వచ్చాయి అతడి మాటలు 

 

అది కాదు సార్ నేను అంటూ మాట్లాడుతూ ఉంటే ఆమె మాటలు పట్టించుకోకుండా బయటికి నడిచాడు అతను 

 

అతని వెనకే పరుగు లాంటి నడకతో బయటికి వచ్చింది అక్షర 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

” ఇప్పుడు చెప్పు మీ మమ్మీ దగ్గరికి కూడా పంపించాను కదా మీ డాడీ సేఫ్ గా బయటకు రావాలి అంటే నేను చెప్పినట్టు వినడం తప్ప నీ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు మిస్ అక్షర !!!! ” అంటూ ఆమె వైపు చూస్తూ 

 

” నాకు మూడ్ వచ్చినప్పుడు వస్తాను రెడీ గా ఉండు బేబీ !!!! ” అంటూ పెదాలు రెండు దగ్గరికి ముడిచి గాల్లోనే ముద్దు ఇస్తున్నట్టు ఇచ్చి కన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు

 

వెళ్తున్న అతని వైపే చూస్తూ ఏడుస్తూ తిరిగి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది 

 

తన దీన స్థితికి తనని తానే నిందించుకుంటూ జరిగింది గుర్తు చేసుకుంటుంది 

 

ఒక వారం ముందు తన జీవితం ఇలా లేదు ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఎలాంటి టెన్షన్లు ఏమీ లేకుండా నీట్ గా ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు మొత్తం ఫ్యామిలీ 

 

కానీ అలాంటిది వారం ముందు తన తండ్రి డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికాడు అన్న న్యూస్ టీవీలో రావడం ఆగమేఘాల మీద పోలీసులు అక్కడికి వచ్చి అక్షరా తండ్రిని అరెస్టు చేయడం వీళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడటం అన్ని ఒక్కసారిగా జరిగిపోయాయి 

 

సిబిఐ వాళ్ళు అక్షర ఆస్తుల్ని సీజ్ చేశారు ఒక విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నదల్లా ఒక్కసారిగా అంతా పోయింది 

 

తల్లిని చెల్లిని తీసుకొని ఒక అద్దె ఇంటి లోకి షిఫ్ట్ అయింది 

 

అక్షర కి చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బ్రతకాలి అన్న డ్రీమ్ సో అందుకే తండ్రి బిజినెస్ కి తనని వారసురాలిగా ప్రకటిస్తాను అన్నా కూడా వద్దు అని చెప్పి మన హీరో గారి ఆఫీస్ లో ఒక చిన్న ఎంప్లాయ్ గా జాబ్ చేస్తూ ఉంది 

 

తన దగ్గర ఉన్న కొంచెం డబ్బులతో వారం రోజుల నుంచి జీవనం సాగిస్తున్నారు 

 

తెలిసిన వాళ్ళని స్నేహితులని అందరికి కాల్ చేసి సహాయం కోసం ప్రయత్నించారు కానీ ఎక్కడ కూడా ఫలితం లేదు ఇక ఇలా కాదు అని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా 

 

అరెస్ట్ జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆఫీసులో 

 

తన బాస్ ఎంత పవర్ఫుల్ అనేది అక్షర కి బాగా తెలుసు అందుకే అతన్ని మీట్ అయ్యి హెల్ప్ అడగాలి అని నిశ్చయించుకుంది 

 

అందుకే ఆరోజు ఆఫీస్ అవర్స్ అయిపోయాక అతని క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది 

 

” మే ఐ గెట్ ఇన్ సార్ !! ” డోర్ దగ్గర నిలబడి అడిగింది 

 

” ఎస్ గెట్ ఇన్ !!! ” వినిపించింది అతని స్వరం 

 

మెల్లగా లోపలికి వెళ్ళింది 

 

” ఎవరు మీరు ?? “

 

” అది నేను మీ ఆఫీసులోనే ఒక ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాను !! ” చెప్పింది అక్షర మృదువుగా 

 

” సో వాట్ ?? “

 

” నాకు మీ హెల్ప్ కావాలి సార్ !!! “

 

” ఏంటి ?? “

 

” అది మా ఫాదర్ ఫోర్ డేస్ బ్యాక్ అరెస్టు అయ్యారు !!! “

 

” వాట్ ?? వెయిట్ వెయిట్ మీ ఫాదర్ అరెస్టు అయింది డ్రగ్స్ సరఫరా విషయం లో కాదు కదా ?? ” వెటకారం అతని మాటల్లో ప్రతిధ్వనించింది 

 

” అవును సార్ అందులోఅరెస్టు అయిన భూపతి గారు మా ఫాదర్ !!! ” తలదించుకొని చెప్పింది అక్షర 

 

” ఏంటి మిస్ ఆటలుగా ఉందా నువ్వు నా కంపెనీలో పని చేసే ఒక సాధారణ ఎంప్లాయ్ వి !!! “

 

” అరెస్ట్ అయిన ఆ భూపతి కొన్ని వందల కోట్లకి అధిపతి అలాంటి అతని కూతురు వి నువ్వు అన్నప్పుడు నా దగ్గర ఎందుకు జాబ్ చేస్తున్నావ్ ?? ” అప్పటి వరకు కంప్యూటర్లో తల దూర్చేసిన అతను తలెత్తి ఆమె వైపు చూసాడు 

 

చూసిన మొదటిసారికే ఆమె అతన్ని ఆకర్షించింది 

 

” నాకు నా కాళ్ళ మీద నేను బ్రతకాలి అని ఆశ సార్ అందుకే కింద నుంచి పైకి రావాలి అని ఇలా జాబ్లో జాయిన్ అయ్యాను !! ” చెప్పింది అక్షర 

 

” అయితే ఇప్పుడు నేనేం చేయాలి ?? “

 

” మీరు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి మా ఫాదర్ నీ ఎలా అయినా మీరే సేవ్ చెయ్యాలి ప్లీజ్ సర్ మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఆ క్యాపబిలిటీ మీకు ఉంది !!! “

 

” దయచేసి మా ఫాదర్ ని కాపాడండి !!! ” చేతులు జోడించి అభ్యర్థనగా తన వైపు చూస్తూ అడిగింది అక్షర 

 

” చూడు మిస్ !!! ” అనగానే 

 

” అక్షర సర్ !! “

 

” ఓకే మిస్ అక్షర నీ బాబు ఇరుక్కుంది అల్లాటప్ప కేసులో కాదు డ్రగ్స్ కేసులో అందులో నుంచి బయటికి తేవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అది ఎండ్ చాలా రిస్క్ కూడా నేనెందుకు చెయ్యాలి ?? ” అడిగాడు అతను 

 

” ప్లీజ్ సర్ మీరు అలా అనకండి ప్లీజ్ సర్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి !!! ” వేడుకున్నట్టే అడిగింది అక్షర 

 

” అయితే నాకేంటి ప్రాఫిట్ ఇందులో ?? ” అడిగాడు అతను 

 

అతను అడిగింది అర్థం కాలేదు అక్షర కి 

 

” అర్థం కాలేదు సార్ ?? “

 

” ఓపెన్ గా మాట్లాడుతున్న నాకు నిన్ను చూడగానే బాగా నచ్చావ్ సో ఒక వారం రోజులు నువ్వు నాతో స్టే చేస్తే మీ నాన్నని విడిపించి నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది !!! “

 

” నాకు కావాల్సింది నేను చెప్పాను నీకు కావాల్సింది నువ్వు చెప్పావు నీకు ఓకే అంటే నాకు కూడా ఓకే ఛాయిస్ ఇస్ యువర్స్ నాకు రేపు మార్నింగ్ కి చెప్పు !!! “

 

” ఒకవేళ చెప్పలేక పోతే ఆఫీస్ కి చీర కట్టుకొని రా దట్ ఇండికేట్స్ యు అగ్రి మై డీల్ నైట్ అంతా బాగా కూర్చుని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా బేబీ !!! ” అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు 

 

 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

 

 

————–continues……… 

 

 

 

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ