ఈ రాధాకృష్ణార్పణం ❤️
ఎపిసోడ్ – 20
గతం విప్పిన రహస్యం
కోటలో అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. దేవేంద్ర చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూస్తూ రాధ ఆలోచనల్లో మునిగిపోయింది. ఇన్నాళ్లూ తనకు తండ్రిగా తెలిసిన రామమూర్తి ఒకవైపు, తనను కన్న తండ్రి దేవేంద్ర మరోవైపు. ఇద్దరి కళ్లలోనూ తనపై ప్రేమ కనిపిస్తోంది. కానీ వాళ్ల జీవితాలను విడదీసిన గతం ఏమిటో తెలుసుకోవాలనే ఆరాటం ఆమెను నిలవనివ్వడం లేదు.